Movie News

10 కోట్లిచ్చిన తెలుగు ప్రేక్షకుల సినీ హృదయం

కంటెంట్ ఏ మాత్రం కొంచెం నచ్చినా చాలు దానికి వసూళ్లు కురిపించేయడం తెలుగు ప్రేక్షకుల సహృదయతకు నిదర్శనం. ఇది ఎన్నోసార్లు ఋజువయ్యింది. బిచ్చగాడు 2 రూపంలో ఇప్పుడు మరో సాక్ష్యం దొరికింది. మూడు రోజుల వీకెండ్ ని బ్రహ్మాండంగా వాడేసుకున్న విజయ్ ఆంటోనీ కేవలం మూడు రోజులకే తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల గ్రాస్ ని దాటేయడం రికార్డే . షేర్ రూపంలో ఆరు కోట్ల దగ్గరగా వెళ్లిపోయింది. ఇంకో ఎనభై తొంబై లక్షలు వస్తే కంప్లీట్ గా బ్రేక ఈవెన్ అయిపోయినట్టే. నిన్న ఆదివారం చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడటం దానికి నిదర్శనం

ఒక్క నైజామ్ నుంచే రెండు కోట్లకు పైగా వసూలు చేయడం చిన్న విషయం కాదు. అలా అని బిచ్చగాడు 2కి భీభత్సమైన పబ్లిక్ రెస్పాన్స్ రాలేదు. ఉన్నవాటిలో బెటర్ ఆప్షన్ ఇదొక్కటే కావడంతో మాస్ అంతా దీనికే వెళ్తున్నారు. అన్నీ మంచి శకునములే కొన్ని మెయిన్ సెంటర్స్ మినహాయించి బాగా స్లో అయిపోయింది. సీతారామం బ్లాక్ బస్టర్ తర్వాత స్వప్న సినిమాకు ఊహించని ఫలితమిది. అంతకు ముందు వారం వచ్చిన కస్టడీ లాంటివి డెడ్ స్లీప్ మోడ్ లోకి వెళ్లిపోవడం బిచ్చగాడు 2కి వరంగా మారింది. దాంతో టాక్ తో సంబంధం లేకుండా ఆదరణ పొందింది

విచిత్రంగా ఒరిజినల్ తమిళ వెర్షన్ కి ఇంత రెస్పాన్స్ లేదు. అక్కడి ఆడియన్స్ అంతగా రిసీవ్ చేసుకోలేదని ట్రేడ్ రిపోర్ట్. కాకపోతే ఇక్కడ మల్లే అక్కడ కూడా అపోజిషన్ లేకపోవడంతో డీసెంట్ ఫిగర్స్ నమోదయ్యాయి. దెబ్బకు విజయ్ ఆంటోనీ బిచ్చగాడు 3కి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. 2025లో రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతోందని త్వరలోనే వివరాలు ప్రకటిస్తానని ప్రమోషన్లలో చెప్పాడు. మణిరత్నం మల్టీస్టారర్ పొన్నియిన్ సెల్వన్ 2 వల్లే కానిది తెలుగులో విజయ్ ఆంటోనీ సాధించడం విశేషం. ఇవాళ్టి నుంచి డ్రాప్ ఎంత శాతం ఉంటుందనేది కీలకం కానుంది

This post was last modified on May 24, 2023 10:21 am

Share

Recent Posts

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

51 minutes ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

6 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

7 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

7 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

7 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

10 hours ago