భారీ ఓపెనింగ్ పై బోల్డ్ కపుల్ కన్ను

కొన్ని సినిమాలకి రిలీజ్ కి ముందే క్రేజ్ ఉంటుంది. ఆడియన్స్ ఎప్పటికప్పుడు ఆ సినిమా అప్ డేట్స్ ఫాలో అవుతూ రిలీజ్ కోసం ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్న క్రేజీ కపుల్ మూవీ ‘మళ్ళీ పెళ్లి’. లివింగ్ రిలేషన్ షిప్ , ముందు భార్యతో గొడవ కారణంగా నరేష్ ఒక టైమ్ లో సోషల్ మీడియాలో పవిత్ర లోకేష్ తో కలిసి విపరీతంగా ట్రోలింగ్ అయ్యారు.

యాబై ఏళ్ల నట ప్రస్థానంలో ఎన్నో గొప్ప పాత్రలు చేసిన నరేష్ ఇప్పుడు పవిత్ర లోకేష్ తో కలిసి సొంత బేనర్ లో ‘మళ్ళీ పెళ్లి’ సినిమా చేశాడు. వీరిద్దరికీ సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ వాడుకొని ఎమ్మెస్ రాజు రెండో పెళ్లి కథతో ఈ సినిమా చేశాడు.పైగా సినిమాలో యూత్ కోరుకునే మంచి మసాలా కూడా దట్టించారు రాజు గారు. దీంతో రిలీజ్ కి ముందే ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు బయ్యర్లు ఎగబడుతున్నారు. తాజాగా నరేష్ కూడా ఈ విషయం చెప్పారు. ఇందులో నిజం లేకపోలేదు.

‘మళ్ళీ పెళ్లి’ సినిమాకి యూత్ లో మాంచి క్రేజ్ ఉంది. ఈ సినిమాలో నరేష్ పవిత్ర కథ తెలుసుకొని ఎంజాయ్ చేసేందుకు ప్రేక్షకులు రెడీగా ఉన్నారు. ఆ క్రేజ్ తోనే ఇప్పటికే శాటిలైట్ , డిజిటల్ కూడా భారీ రేటుకి అమ్ముడుపోయాయి. ఇక థియేట్రికల్ పరంగా కూడా మంచి కలెక్షన్ రావడం ఖాయమనిపిస్తుంది. మరి తమ లిప్ లాక్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన పవిత్ర నరేష్ ఈ సినిమాతో ఏ రేంజ్ ఓపెనింగ్ రాబడతారో ? అనే డిస్కషన్ నడుస్తుంది.