ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస హిట్లతో వైభవం అనుభవించి ఇప్పుడు డౌన్ ఫాల్ చూస్తున్న దర్శకుల్లో తేజ ఒకరు. ముక్కుసూటి మాటలతో ఆకట్టుకునే తేజ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫ్లాప్స్ కి కారణం చెప్పారు.
తను ఎమోషనల్ పర్సన్ అని చెప్తూ , కొంచెం హర్ట్ అయ్యాను , ఫీలయ్యాను అంటే సినిమా మీద ఫోకస్ పెట్టలేను. సినిమా మధ్యలో డిస్ కనెక్ట్ అయిపోయి వారికి ఏం కావాలో అదే తీసి ఇచ్చేస్తా అంటూ దర్శకుడు తేజ చెప్పుకున్నాడు. అలా ఒకసారి తను డిస్కనెక్ట్ అయితే ఇంక అనుకున్నది తీయలేనని సినిమాను వదిలేయడమే అంటూ తేజ తెలిపాడు.
ఇక రాజమౌళి గొప్పదనం గురించి ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అయితే తేజ మాత్రం ఇండియన్ రుపీ వెల్యూ రాజమౌళి వల్ల పెరగనుందని అన్నాడు. అమెరికన్ సినిమాలు చూసి ఆ దేశానికి డాలర్ రేటు పెరిగిందని , అలాగే రాజమౌళి హై స్టాండర్డ్స్ తో తీసే తెలుగు సినిమాల వల్ల త్వరలోనే ఇండియన్ రుపీ వెల్యూ పెరుగుతుందని అన్నాడు.
ప్రస్తుతం అభిరామ్ దగ్గుబాటి హీరోగా తేజ తీసిన అహింస రిలీజ్ కి రెడీ అయింది. పలు సార్లు రిలీజ్ వాయిదా పడిన ఈ సినిమా జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. సీత వంటి డిజాస్టర్ తర్వాత తేజ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. మరి తన మాటలతో అదరగొట్టి క్లాప్స్ కొట్టించే తేజ దర్శకుడిగా ఈసారి ఎలాంటి హిట్ కొడతాడో వేచి చూడాలి.
This post was last modified on May 23, 2023 8:56 pm
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…