ఒకప్పుడు సౌత్ నటీనటులను దృష్టిలో ఉంచుకుని బాలీవుడ్ రచయితలు, దర్శకులు కథలు రాయడం.. సినిమాలు తీయడం అరుదుగా జరిగేది. కానీ ఇప్పుడు సౌత్ సినిమాలు, ఇక్కడ స్టార్ల మార్కెట్ తిరుగులేని స్థాయికి చేరిన నేపథ్యంలో వాళ్ల మీద బాలీవుడ్ కళ్లు బాగానే పడుతున్నాయి.
ఈ మధ్యే హృతిక్ రోషన్‌తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ ‘వార్-2’ చేయబోతున్న విషయం వెల్లడైంది. ఇంకా పలువురు సౌత్ నటీనటులతో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఐతే ఇలాంటి అవకాశాలను వదులుకుంటున్న వాళ్లు కూడా లేకపోలేదు. తమిళ సీనియర్ నటుడు విక్రమ్ అదే పని చేశాడట. హిందీలో దర్శకుడిగా చాలా మంచి పేరున్న అనురాగ్ కశ్యప్ విక్రమ్‌ను దృష్టిలో ఉంచుకునే ఒక కథ రాసి తనకు వినిపిస్తే.. విక్రమ్ నుంచి అసలు స్పందనే లేదట. ఇక అవకాశం లేక తాను ఆ కథను రాహుల్ భట్‌తో తీసినట్లు అనురాగ్ వెల్లడించాడు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఆ చిత్రమే.. కెన్నడీ.
‘‘కెన్నడీ కథ రాస్తున్నపుడు నా మనసులో విక్రమ్ మాత్రమే ఉన్నారు. ఆయన్ని దృష్టిలో ఉంచుకునే ఈ కథ సిద్ధం చేశాను. విక్రమ్ అసలు పేరు కెన్నడీ. అందుకే నా సినిమాకు ‘కెన్నడీ’ అనే పేరే పెట్టాను. కథ పూర్తయ్యాక విక్రమ్‌ను కలిసి స్టోరీ లైన్ వినిపించాను. కానీ తర్వాత ఆయన్నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆ తర్వాత ఓసారి రాహుల్ భట్‌ను కలిసి ఈ కథను తన చేతికి ఇచ్చాను. కథ చదువుతున్నంతసేపు ఆయన కనబరిచిన ఆసక్తి నన్ను ఆకట్టుకుంది. ఇందులో ఎవరు నటిస్తున్నారని రాహుల్ అడిగితే.. మీరు ఓకే అంటే లీడ్ రోల్‌లో మీరే కనిపిస్తారు అన్నాను. కాకపోతే ఈ పాత్ర కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది అని చెప్పాను. ఆయన ఎనిమిది నెలల పాటు మిగతా సినిమాలన్నీ పక్కన పెట్టి దీని కోసం కష్టపడ్డారు’’ అని అనురాగ్ వెల్లడించాడు.
అనురాగ్ స్థాయి దర్శకుడి కథను విని విక్రమ్ అసలు స్పందించనే లేదంటే అతను కచ్చితంగా షాకయ్యే ఉంటాడు. ‘కెన్నడీ’ సినిమాను అనురాగ్ తాజాగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రమోట్ చేశాడు. సన్నీ లియోని కథానాయికగా నటించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on May 22, 2023 3:41 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…