ఏడేళ్ల కిందట టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా ‘బిచ్చగాడు’. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై ఆ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ చిత్రానికి ఇంత కాలానికి సీక్వెల్ చేశాడు విజయ్ ఆంటోనీ. ‘బిచ్చగాడు’ను శశి డైరెక్ట్ చేస్తే.. ‘బిచ్చగాడు-2’ను స్వయంగా విజయ్ ఆంటోనీనే స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాడు.
గత శుక్రవారమే తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి ఏమంత మంచి టాక్ రాలేదు. ‘బిచ్చగాడు’కు దరిదాపుల్లో కూడా లేదనే విమర్శలు వచ్చాయి. అయినా సరే.. టాక్‌తో సంబంధం లేకుండా ఈ చిత్రం రెండు భాషల్లోనూ మంచి వసూళ్లు రాబడుతోంది. తెలుగులో మాత్రమే ఇప్పటిదాకా పది కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసి సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తోంది. తమిళంలో కూడా మంచి ఓపెనింగ్సే వచ్చాయి.
ఈ ఉత్సాహంలో విజయ్ ఆంటోనీ ‘బిచ్చగాడు’ ఫ్రాంఛైజీలో కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. ‘బిచ్చగాడు-3’ కచ్చితంగా ఉంటుందని.. 2025లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుందని తెలిపాడు. ‘బిచ్చగాడు-2’ మాదిరే ఈ చిత్రం కూడా ఒక కొత్త కథతో తెరకెక్కుతుందని.. తొలి రెండు సినిమాలతో దీనికి సంబంధం ఉండదని విజయ్ స్పష్టం చేశాడు.
బిచ్చగాడు-3ని కూడా తనే డైరెక్ట్ చేసే అవకాశాలున్నట్లు విజయ్ సంకేతాలు ఇచ్చాడు. ‘బిచ్చగాడు-2’ను ముందు వేరే దర్శకుడితో మొదలుపెట్టిన విజయ్.. తర్వాత తనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. ఈ చిత్రానికి నిర్మాత కూడా అతనే. సినిమా మంచి లాభాలు అందిస్తుండటం, ‘బిచ్చగాడు’ బ్రాండ్ ఎంత స్ట్రాంగో బాక్సాఫీస్ దగ్గర మరోసారి రుజువు కావడంతో మరో ఆలోచన లేకుండా ఈ ఫ్రాంఛైజీలో కొత్త సినిమాను ప్రకటించేశాడు విజయ్.
This post was last modified on May 22, 2023 3:42 pm
అట్లీ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా అనౌన్స్ మెంట్ వచ్చాక దాని మీద సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ…
మంగళగిరి నియోజకవర్గం పేరు చెప్పగానే ఠక్కున ఇప్పుడు నారా లోకేష్ గుర్తుకు వస్తున్నారు. నియోజక వర్గంలో చేపడుతున్న పనులు కావొచ్చు..…
మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…