టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ ఆస్తి పాస్తుల గురించి తరచుగా చర్చ జరుగుతూ ఉంటుంది. 70వ దశకం నుంచి సినిమాల్లో చాలా బిజీగా ఉన్న నరేష్ సొంతంగానే పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదించగా.. తల్లి విజయ నిర్మల నుంచి వచ్చిన ఆస్తులు కూడా కలిపితే అది వెయ్యి కోట్లకు తక్కువ ఉండదు అని ఇండస్ట్రీ జనాలు అంటుంటారు. ఐతే నరేష్ ఇప్పటిదాకా మీడియా ముందు కానీ.. ఇంటర్వ్యూల్లో కానీ తన ఆస్తుల గురించి పెద్దగా మాట్లాడింది లేదు.
కానీ తనే లీడ్ రోల్ చేసిన కొత్త చిత్రం ‘మళ్ళీ పెళ్ళి’ని గట్టిగా ప్రమోట్ చేస్తున్న నరేష్.. ఇందులో భాగంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్థిక విషయాల గురించి ఓపెన్ అయ్యాడు. తన ఆస్తి వెయ్యి కోట్లు, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చన్న ప్రచారంపై ఆయన స్పందించారు. ఇవి ఊహాగానాలు కాదని.. నిజమే అని క్లారిటీ ఇవ్వడం విశేషం.
“నేను రిచ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అవును.. నేను బిలియనీర్‌ని అని ఒప్పుకుంటా. మా అమ్మగారి నుంచి నాకు ఆస్తులు వచ్చాయి. నేను కూడా కష్టపడి చాలానే సంపాదించా. మేం భూముల మీద పెట్టుబడులు పెట్టాం. వాటి ధరలు బాగా పెరిగాయి. మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఐతే ఎంత డబ్బు ఉంది అన్నదాన్ని బట్టి మనం ఎంత ధనవంతులం అనేది ఆధారపడి ఉండదు. ఎంత సంతోషంగా ఉన్నాం అన్నదే ముఖ్యం. రోజూ ఎంత ఆనందంగా గడుపుతాం. ఉన్న డబ్బును ఎలా ఖర్చు పెడతాం అన్నది చూడాలి. మేం మా కోసమే కాక అవసరంలో ఉన్న వారి కోసం కూడా డబ్బులు ఖర్చు పెడతాం. మాకు వీలైనంత మేర పది మందికి సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. నేను చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నా. ఆస్వాదిస్తున్నా. అది అన్నింటికంటే ముఖ్యమైన విషయం” అని నరేష్ తెలిపాడు.
This post was last modified on May 22, 2023 6:34 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…