Movie News

హీరోయిన్ కిడ్నాప్.. మొత్తం బుస్


ఈ రోజుల్లో చిన్న స్థాయి సినిమాల కోసం థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడం చాలా చాలా కష్టం అయిపోతోంది. ప్రస్తుత బిజీ లైఫ్‌లో ఓటీటీలను దాటి థియేటర్ల వరకు ప్రేక్షకులను రప్పించడం అంటే అంత తేలిక కాదు. పెద్ద హీరోల సినిమాలకు ఢోకా లేదు కానీ.. చిన్న, మీడియం రేంజ్ సినిమాల పరిస్థితే రోజు రోజుకూ కష్టం అవుతోంది. వెరైటీ ప్రమోషన్లు, ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో ఆకట్టుకుంటే తప్ప ప్రేక్షకులు థియేటర్ల వైపు కదలట్లేదు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల విషయంలో కొందరు కొత్త కొత్తగా ట్రై చేస్తున్నారు.

ఐతే ‘రెజీనా’ అనే ఓ తమిళ సినిమా పట్ల ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచడానికి ఆ చిత్ర బృందం చేసిన ఒక ప్రయత్నం విమర్శల పాలైంది. ఈ సినిమాలో సునైనా లీడ్ రోల్ చేస్తోంది. డొమిన్ డిసిల్వా అనే యువ దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ థ్రిల్లర్ సినిమా మేకింగ్ దశలో ఉండగానే చిత్ర బృందం ఒక డ్రామాను నడిపించింది.

సునైనా కిడ్నాప్ అయినట్లుగా ఒక వార్తను లీక్ చేశారు. ఈ విషయంలో తెలిసి సన్నిహితులు, అభిమానులు.. సునైనాకు ఫోన్లు చేయగా.. ఆమె నంబర్ రెండు రోజుల పాటు స్విచాఫ్ అయి ఉంది. దీంతో హీరోయిన్ సునైనా కిడ్నాప్ అంటూ కోలీవుడ్లో వార్త దావానలంలా వ్యాపించింది. చివరికి చూస్తే ఇదంతా సినిమా ప్రమోషన్లలో భాగమని తేలింది. తాను సేఫ్‌గానే ఉన్నానని.. ఇదంతా తన పాత్ర తాలూకు ఇంటెన్సిటీని చూపించడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం అని.. ఏదో కవరప్ చేయడానికి ప్రయత్నించింది. దీంతో చిత్ర బృందం మీద తీవ్ర విమర్శలు వచ్చాయి.

ప్రమోషన్ల కోసం మరీ ఇంత డ్రామా నడిపించాలా.. అభిమానుల మనోభావాలతో ఆడుకోవాలా అన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఐతే విమర్శల మాటెలా ఉన్నా.. లేడీ ఓరియెంటెడ్ మూవీ అయిన ‘రెజీనా’ గురించి మీడియాలో, సోషల్ మీడియాలో బాగా చర్చ జరిగిందిన చిత్ర బృందం హ్యాపీగానే ఫీలవుతున్నట్లు తెలుస్తోంది.

This post was last modified on May 22, 2023 7:03 am

Share

Recent Posts

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

22 minutes ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

2 hours ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

5 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

5 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

6 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

13 hours ago