Movie News

మంచు మనోజ్ డబుల్ ధమాకా


ఒకప్పుడు చాలా బిజీగా ఉంటూ వరుసబెట్టి సినిమాలు చేస్తూ వచ్చిన మంచు మనోజ్.. ఐదేళ్ల పాటు సినిమా లేకుండా ఖాళీగా ఉండిపోతాడని ఎవ్వరూ ఊహించలేదు. 2017 చివర్లో వచ్చిన ‘ఒక్కడు మిగిలాడు’నే మనోజ ్ చివరి సినిమా. ఆ తర్వాత మూడేళ్ల పాటు సినిమా ఊసే ఎత్తని అతను.. మధ్యలో ‘అహం బ్రహ్మాస్మి’ పేరుతో సినిమాను అనౌన్స్ చేసి.. తర్వాత దాన్ని కూడా అటకెక్కించేసిన సంగతి తెలిసిందే.

ఐతే కొన్ని నెలల కిందట మనోజ్ మరో సినిమాను అనౌన్స్ చేశాడు. అదే.. వాట్ ద ఫిష్. ‘నేను మీకు తెలుసా’ సినిమాను గుర్తు చేస్తూ క్రేజీగా కనిపించింది ఈ సినిమా టైటిల్, ప్రి లుక్ పోస్టర్. ఈ రోజు మనోజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘వాట్ ద ఫిష్’‌కు సంబంధించి చిన్న టీజర్ లాంటి వీడియో ఒకటి వదిలారు.

అది క్రేజీ క్రేజీగా సాగిపోతూ.. మనోజ్ అభిమానులనే కాక విభిన్నమైన సినిమాలను ఇష్టపడే వారిని ఆకట్టుకుంది. సినిమా యనీక్‌గా, క్రేజీగా ఉండబోతోందని.. మనోజ్ ఈ సినిమాలో రకరకాల అవతారాల్లో కనిపించబోతున్నాడని సంకేతాలు ఇచ్చింది. ఈ చిత్రాన్ని వి అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్నాడు.

ఇదిలా ఉంటే.. పుట్టిన రోజు సందర్భంగా మనోజ్ నటించబోయే మరో కొత్త చిత్రాన్ని కూడా ప్రకటించడం విశేషం. భాస్కర్ బంటుపల్లి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఎల్ఎస్ ప్రొడక్షన్స్ బేనర్ ప్రొడక్షన్ నంబర్ 3. శ్రీనివాసులు, వేణుగోపాల్, మమత, ముళ్ళపూడి రాజేశ్వరి ఉమ్మడిగా నిర్మించే ఈ చిత్రానికి పెద్ద బడ్జెట్టే పెడుతున్నారట. ఇది కూడా ఒక వైవిధ్యమైన కథాంశంతోనే తెరకెక్కనుందట. కొన్నేళ్ల పాటు సినిమానే లేకుండా ఉండిపోయిన మనోజ్.. ఈ పుట్టిన రోజుకు రెండు కొత్త సినిమాల విశేషాలతో అభిమానులకు డబుల్ ధమాకా ట్రీట్ ఇవ్వడం విశేషమే.

This post was last modified on May 20, 2023 9:55 pm

Share

Recent Posts

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

5 minutes ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

50 minutes ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

2 hours ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

2 hours ago

పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…

2 hours ago

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

3 hours ago