కొన్నిసార్లు ఇండస్ట్రీలో నెగ్గాలంటే కేవలం సపోర్ట్, ఆఫర్లు ఉంటే సరిపోదు. టాలెంట్ తో పాటు సరైన కథలు డైరెక్టర్ల కాంబినేషన్లు పడాలి. లేదంటే ఎక్కువ కాలం కొనసాగడం కష్టం. సంతోష్ శోభన్ పరిస్థితి అలాగే ఉంది. స్వప్న సినిమా లాంటి పెద్ద బ్యానర్ లో అన్నీ మంచి శకునములే చేశాడు. పబ్లిక్ టాక్, రివ్యూలు డివైడ్ గా వచ్చాయి. ఈ ఆదివారం దాటితే కష్టమేనని ట్రేడ్ టాక్. అటువైపు నిర్మాతలు ప్రమోషన్ స్పీడ్ తగ్గించేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి సమ్మర్ లో మంచి ఛాయస్ గా నిలిచే అవకాశాన్ని దర్శకురాలు నందినిరెడ్డి వాడుకోలేదని మూవీ లవర్స్ అభిప్రాయ పడుతున్నారు
ఇదే కాదు సంతోష్ శోభన్ గత మూడు సినిమాలు దారుణమైన ఫలితాలు అందుకున్నాయి. శ్రీదేవి శోభన్ బాబు కనీసం పబ్లిసిటీ వెనక్కు తేలేకపోగా కళ్యాణం కమనీయం యావరేజ్ కంటెంట్ తో పాటు సంక్రాంతి రేసులో నలిగిపోయింది. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరీ అన్యాయం. మారుతీతో జట్టు కట్టిన మంచి రోజులు వచ్చాయి కూడా సోసో ఫలితమే. ఇవన్నీ థియేట్రికల్ ఫెయిల్యూర్స్. యూవి క్రియేషన్స్, సుస్మిత కొణిదెల, వైజయంతి మూవీస్, సంపత్ నంది, ఎస్కెఎన్ లాంటి పెద్ద చేతులే అండగా ఉన్నా లాభం లేకుండా పోతోంది. రిలీజ్ వరకే ఈ అంశాలు ఉపయోగపడుతున్నాయి
పోనీ కుర్రాడిలో విషయం లేదా అంటే లుక్స్, యాక్టింగ్ రెండింటి మీదా ఎప్పుడు విమర్శలు రాలేదు. చలాకీగా ఉంటాడు. చక్కగా చేస్తాడు. అన్నీ ఉన్నా అంగట్లో శనీశ్వరుడి సామెత లాగా ఇన్నేసి దెబ్బలు తట్టుకోవడం సులభం కాదు. మొన్నో ఇంటర్వ్యూలో సిద్దు జొన్నలగడ్డ సరదాగా సంతోష్ శోభన్ ని ఓ ప్రశ్న అడిగాడు. అసలు ఇన్ని సినిమాలు ఎందుకు చేస్తున్నావని. అంటే వరసబెట్టి రావడమే కానీ హిట్టు కొట్టింది లేదని తన అభిప్రాయం. ఇప్పుడదే మళ్ళీ నిజమయ్యింది. ప్రేమ్ కుమార్ నిర్మాణంలో ఉంది. కనీసం అదైనా ఈ పరంపరకు బ్రేక్ వేస్తుందేమో చూడాలి
This post was last modified on May 20, 2023 4:47 pm
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…