గత ఏడాది టీజర్ టైంలో వచ్చిన నెగటివిటిని పోగొట్టుకునే క్రమంలో ఆదిపురుష్ బృందం వేస్తున్న అడుగులు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ట్రైలర్ ఇప్పటికే బ్లాక్ బస్టర్ అయ్యింది. గ్రాఫిక్స్ విషయంలో ఉన్న అనుమానాలకు టి సిరీస్, దర్శకుడు ఓం రౌత్ సమాధానం చెప్పారు. అసంతృప్తి పూర్తిగా తొలగనప్పటికీ ఒక మంచి ఇంప్రెషన్ తెచ్చుకోవడంలో టీమ్ విజయవంతమయ్యింది. తాజాగా వదిలిన జై శ్రీరామ్ లిరికల్ వీడియోకు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది. కేవలం గంటల వ్యవధిలోనే మిలియన్ మార్కుకు పరుగులు పెట్టడం దీనికి సూచిక
అతుల్ అజయ్ కంపోజింగ్ లో బృందగానం జరిగిన ఈ పాట తెలుగు వెర్షన్ కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం సమకూర్చారు. రఘురాముడి గుణగణాలను వర్ణిస్తూనే తన అభయం ఎంతటి ధైర్యాన్ని ఇస్తుందో వర్ణించిన తీరు బాగుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ట్రైలర్ లో లేని కొన్ని కొత్త షాట్లు ఇందులో పొందుపరిచారు. అవీ ఆకట్టుకునేలా ఉన్నాయి. శ్రీరామ నవమితో పాటు ఇకపై ఆ దేవుడికి సంబంధించిన ఏ సందర్భంగా వాడుకునేలా ట్యూన్ చేయడం విశేషం. అంతా బాగానే ఉంది దీన్ని కేవలం రెండున్నర నిమిషాలలోపే పరిమితం చేయడం కొంత మైనస్ అనిపిస్తోంది
రాబోయే ఇరవై అయిదు రోజుల్లో ప్రమోషన్లను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లేందుకు ఆదిపురుష్ పక్కా ప్లానింగ్ తో ఉంది. టైం తక్కువగా ఉంది కాబట్టి దేశమంతా కీలక నగరాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లతో పాటు పలు ఇంటర్వ్యూలు మీడియా మీట్లు ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తం క్యాస్ట్ అండ్ క్రూ అందుబాటులో ఉండేలా కాల్ షీట్స్ తీసుకున్నారు. జూన్ తొలి రెండు వారాలు ఉధృతంగా జై శ్రీరామ్ నినాదాన్ని తీసుకెళ్లే క్రమంలో భాగంగా పలు దేవాలయాల్లోనూ కార్యక్రమాలు చేయబోతున్నారు. ప్రభాస్ ని మళ్ళీ మళ్ళీ లైవ్ లో చూసేందుకు ఫ్యాన్స్ కి ఇదే మంచి ఛాన్స్