భారీ ఎత్తున ప్రమోషన్లు చేయకపోయినా బిచ్చగాడు 2 ఓపెనింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో బాగా నమోదయ్యాయి. ప్రధాన కేంద్రాల్లో ఉదయం షోలు హౌస్ ఫుల్ పడటం అనూహ్యం. టాక్ ఎంత డివైడ్ గా ఉన్నా ఫస్ట్ పార్ట్ తాలూకు ప్రభావం ఆడియన్స్ మనసులో బలంగా ఉండటంతో ఇది కూడా బాగానే ఉంటుందన్న నమ్మకంతో థియేటర్లకు వచ్చారు. గత కొన్నేళ్లలో విజయ్ ఆంటోనీ ఏ సినిమా కనీసం యాభై శాతం ఆక్యుపెన్సీతో షోలు మొదలుకాలేదు. డెఫిషిట్లే ఎక్కువ. అలాంటిది బిచ్చగాడు 2 ఆ ట్రెండ్ కి భిన్నంగా కొన్ని ఏరియాలలో షాకింగ్ ఫిగర్స్ వచ్చాయి.
ట్రేడ్ నుంచి వచ్చిన సమాచారం మేరకు మొదటి రోజు బిచ్చగాడు 2 సుమారుగా 2 కోట్ల 30 లక్షల షేర్ వసూలు చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే ఇది నాలుగు కోట్ల పైమాటే. ఇది ఫస్ట్ డే పొన్నియిన్ సెల్వన్ 2 కంటే ఎక్కువ. దీన్ని బట్టే విజయ్ ఆంటోనీ మూవీ మీద జనాలకు ఏ స్థాయిలో కాన్ఫిడెన్స్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క నైజాం నుంచే డెబ్భై లక్షల దాకా రావడం మాములు విషయం కాదు. ఒకపక్క అన్నీ మంచి శకునములే టాక్ దీనికి ప్లస్ గా మారుతోంది. బిచ్చగాడు 2కి యునానిమస్ గా పాజిటివ్ టాక్ రాలేదు.రివ్యూలు సైతం మిశ్రమంగానే ఉన్నాయి.
ఇంకో నాలుగు కోట్ల షేర్ వస్తే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఈ వీకెండ్ ఇంకే సినిమాలు మాస్ కి ఆప్షన్ లేవు కాబట్టి బిచ్చగాడు 2కి అది ప్లస్ కానుంది. వచ్చే వారం మళ్ళీ పెళ్లి, మేం ఫేమస్, 2018 రాబోతున్న నేపథ్యంలో ఆ లోగానే వీలైనంత రాబట్టుకోవాలి. వాటి టాక్ ఎలా ఉన్నా విజయ్ ఆంటోనీ సినిమా ఓసారి చూడొచ్చనే మాట పబ్లిక్ లో స్ప్రెడ్ అయితే లాభాలు అందుకునే ఛాన్స్ లేకపోలేదు. శాకుంతలంతో మొదలుపెట్టి కస్టడీ దాకా బాక్సాఫీస్ వద్ద ఏదీ వర్కౌట్ కాని పరిస్థితులు బిచ్చగాడు 2కి అనుకూలంగా మారాయి. లెక్కలు మాత్రం ఊహించనివే నమోదయ్యాయి.
This post was last modified on May 20, 2023 12:33 pm
ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పదవి చేపట్టాక విడుదలవుతున్న మొదటి సినిమా ఇప్పటికైతే హరిహర వీరమల్లునే. ఇందులో అనుమానం…
తెలుగు దర్శకులు హిందీలో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. రాఘవేంద్రరావు, మురళీమోహనరావు లాంటి సీనియర్లు ఎప్పుడో బాలీవుడ్లో సినిమాలు తీశారు.…
ఏపీలో అధికార పక్షం కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీలో కొందరు నేతల సొంత నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కూటమి…
ఏపీలోని పలు పురపాలికల్లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీ నేపథ్యంలో తిరుపతిలో ఆదివారం నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.…
మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎందరో ఫిలిం మేకర్స్ ఎదురు చూస్తున్న ఎస్ఎస్ఎంబి 29 ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే.…
తెలంగాణలో ఉప ఎన్నికలు జరగనున్నాయా? ఈ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రకటన ఏమైనా వచ్చిందా? అలాంటిదేమీ లేకున్నా..…