స్టార్ హీరోలు తమ సినిమాల సంఖ్య విషయంలో 25.. 50.. 75.. 100.. ఇలాంటి మైలురాళ్లను ప్రత్యేకంగా భావిస్తారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లాంటి ఒకప్పటి పెద్ద హీరోలు వందల సంఖ్యలో సినిమాలు లాగించేశారు కానీ.. ఇప్పటి స్టార్లు 50 సినిమాల మార్కును అందుకోవడం కూడా కష్టం అయిపోతోంది. నిన్నటితరం సూపర్ స్టార్లలో చిరంజీవి 150 మైలురాయిని అందుకుంటే.. బాలకృష్ణ 100 మార్కును దాటేశాడు. నాగార్జున 100కు చేరువగా ఉన్నాడు. వెంకటేష్ ప్రస్తుతం 75వ సినిమా చేస్తున్నాడు.
ఈ చిత్రాన్ని వెంకీతో పాటు దగ్గుబాటి ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది. చాలా కథలు, దర్శకులను పరిశీలించి.. చివరికి ‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలనుతో ‘సైంధవ్’ను సెట్ చేసింది. ఈ కాంబినేషన్ వెంకీ అభిమానుల్లోనే కాక సామాన్య ప్రేక్షకుల్లోనూ అమితాసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాకు శైలేష్ ఎంచుకున్న కాస్టింగ్ కూడా ఇంట్రెస్టింగే. శ్రద్ధ శ్రీనాథ్ ఇందులో హీరోయిన్ కాగా.. బాలీవుడ్ గ్రేట్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ విలన్ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.
వెంకీ 75లో నవాజుద్దీన్‌ను విలన్‌గా ప్రకటించినపుడే అందరూ ఎగ్జైట్ అయ్యారు. ఆయన నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నవాజుద్దీన్ ప్రతిభకు తార్కాణాలుగా చూపించడానికి బాలీవుడ్లో ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్’ సహా ఎన్నో సినిమాలున్నాయి. అలాంటి నటుడు తెలుగులో సినిమా చేయడానికి అంగీకరించాడంటేనే క్యారెక్టర్ ఒక రేంజిలో ఉంటుందని అంచనా వేయొచ్చు.
ఐతే నవాజ్‌ను మాస్‌గా ఉండే వయొలెంట్ పాత్ర చేస్తాడని అనుకుంటే.. అతణ్ని పక్కా క్లాస్ క్యారెక్టర్లో దించాడు శైలేష్. నవాజ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ‘సైంధవ్’ నుంచి తన ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. ఇందులో ‘వికాస్ మాలిక్’ అనే పాత్ర చేస్తున్నాడు నవాజ్. ఒక పోష్ కారు ముందు.. సిగరెట్ వెలిగించుకుని ట్రెండీ డ్రెస్‌లో కనిపించాడు నవాజ్. ఈ లుక్ చూస్తే చాలా క్లాస్‌గా ఉంది. మరి ఇలాంటి అవతారంలో నవాజ్ ఎలా విలనీ పండిస్తాడన్నది ఆసక్తికరం. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్లో రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.
This post was last modified on May 20, 2023 10:07 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…