కొన్నేళ్లుగా కంగనా రనౌత్ తన సినిమాలతో కంటే కూడా వేరే విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె రాజకీయ వ్యవహారాల్లో అవసరం లేని జోక్యంతో తన కెరీర్‌ను చేజేతులా దెబ్బ తీసుకుందనే చెప్పాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కారుకు మద్దతుగా మాట్లాడ్డం మొదలుపెట్టి, ఒక దశ దాటాక భజనపరురాలిలా మారిపోవడం.. బీజేపీ వైరి పక్షాల మీద శ్రుతి మించి విమర్శలు చేయడం ఆమె చాలానే చేటు చేసింది.
కంగనా మీద వ్యతిరేకత బాగా పెరిగిపోయి.. ఆ ప్రభావం తన సినిమాల మీద గట్టిగానే పడింది. మరోవైపు కంగనా అనేక బ్రాండ్ల ప్రచారం నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి కూడా తలెత్తింది. ఈ నష్టం గురించి తాజాగా కంగనా స్పందించింది. తనను ఉన్నట్లుండి అనేక బ్రాండ్ల ప్రచారం నుంచి తప్పించడంతో రూ.40 కోట్లు నష్టపోవాల్సి వచ్చిందని.. అందుకు తనకు బాధేమీ లేదని కంగనా వ్యాఖ్యానించడం విశేషం.
‘‘నిజాలు మాట్లాడినందుకు చాలా కోల్పోవాల్సి వస్తుంది’’ అంటూ ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ చేసిన ఒక ట్వీట్‌పై స్పందిస్తూ తాను కూడా నిజాలు మాట్లాడి చాలా నష్టపోయినట్లు వెల్లడించింది కంగనా. ‘‘ఇది నా వ్యక్తిగతం.. నా స్వేచ్ఛ.. నా విజయం. నేను హిందూయిజానికి మద్దతుగా.. రాజకీయ నాయకులకు, దేశద్రోహులకు వ్యతిరేకంగా నిజాలు మాట్లాడినందుకు చాలా నష్టపోయా.
రాత్రికి రాత్రి 20-25 సంస్థలు తమ ఉత్పత్తుల ప్రచారం కోసం చేసుకున్న ఒప్పందాల నుంచి నన్ను తప్పించాయి. దీని వల్ల ఏడాదికి 30-40 కోట్ల దాకా నష్టపోయాను. అయినా నాకేమీ బ ాధ లేదు. నేనిప్పుడు స్వేచ్ఛా జీవిని. మరింత గట్టిగా నా గళం వినిపిస్తా’’ అని కంగనా పేర్కొంది. గత ఏడాది కంగనా నటించిన ధకడ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఘోరాతి ఘోరమైన ఫలితాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుం ఆమె ఎమర్జెన్సీతో పాటు చంద్రముఖి-2 సినిమాల్లో నటిస్తోంది.
This post was last modified on May 19, 2023 3:46 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…