కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మార్కెట్ ప్రతి సినిమాకు పెరగడమే తప్ప ఇప్పట్లో తగ్గే సూచనలు లేవు. అందరూ టీవీ సీరియల్ లా ఉందని విమర్శించిన వారసుడుతో సైతం మూడు వందల కోట్లను రాబట్టడం విజయ్ కే చెల్లింది. పివిఆర్ మల్టీప్లెక్స్ ఇటీవలే వెల్లడించిన ఆర్థిక ఫలితాల్లో దీనిదే అగ్ర స్థానం కావడం గమనార్హం. ఇప్పుడు ఇతని రెమ్యునరేషనే 200 కోట్లని తన 68వ ప్రాజెక్ట్ కి అంత మొత్తం ఇవ్వడానికి నిర్మాత సరే అన్నారనే వార్త మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం విజయ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో లియో చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఇంటరెస్టింగ్ లీక్ ఒకటి బయటికి వచ్చింది. లియోలో సంజయ్ దత్ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి యూనిట్ ఎప్పుడో రివీల్ చేసింది. ఇటీవలే ఒక షెడ్యూల్ పూర్తి చేశారు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇందులో సంజు భాయ్ విజయ్ ఇద్దరూ తండ్రి కొడుకులుగా కనిపిస్తారు. ఇదో గ్యాంగ్ స్టర్ డ్రామా.
మాఫియా సామ్రాజ్యానికి దూరంగా కాశ్మీర్ లో ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ పెట్టుకుని ప్రశాంతంగా జీవిస్తున్న లియో జాడను కనుక్కున్న శత్రువులు అక్కడిదాకా వస్తారు. దేశం మొత్తం వణికిపోయే నాన్నను వదిలేసి లియో అక్కడికి ఎందుకు వచ్చాడనేదే అసలు పాయింటట. ఇలాంటి స్టోరీ లైన్ తో గతంలో చాలానే వచ్చాయి. ఒకకరంగా వీటికి హాలీవుడ్ క్లాసిక్ గాడ్ ఫాదరే స్ఫూర్తి.
అయితే లోకేష్ మార్క్ ట్రీట్ మెంట్ చాలా కొత్తగా ఉంటుందని విక్రమ్ లో ఎలా అయితే కమల్ హాసన్ ని ప్రెజెంట్ చేశారో అంతకు మించి అనే స్థాయిలో ఎలివేషన్లు ఇస్తారట. అక్టోబర్ 19న దసరా కానుకగా విడుదల కాబోతున్న లియోకు అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. తెలుగులో బాలయ్య, రవితేజలతో గట్టి పోటీ ఎదురుకోవాల్సి ఉంటుంది. ప్యాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ చేస్తున్న లియో బిజినెస్ ని మూడు వందల కోట్లకు టార్గెట్ చేసుకున్నారని టాక్.
This post was last modified on May 19, 2023 10:15 am
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…