నితిన్ తన ప్రతి సినిమాలోను టాప్ హీరోయిన్ వుండేలా చూసుకుంటున్నాడు. సమంతతో చేసిన ‘అఆ’, రష్మికతో చేసిన ‘భీష్మ’ సూపర్‍హిట్టవడంతో ఇక తన సినిమాల్లో టాప్ హీరోయిన్ ఎవరైనా ఉండాల్సిందేనని పట్టుబట్టాడు. నితిన్ తదుపరి చిత్రం ‘రంగ్ దే’లో కూడా కీర్తి సురేష్ హీరోయిన్. ‘మహానటి’ తర్వాత ఆమె తెలుగులో చేసిన ఏకైక కమర్షియల్ చిత్రమిదే.
అంధాధూన్ రీమేక్ నిర్మించనున్న నితిన్ అందులో కూడా ఎవరైనా టాప్ హీరోయిన్ వుండాలనుకున్నాడు. అందుకే పూజ హెగ్డేని కాంటాక్ట్ చేసాడు. కానీ ఆమె కాల్షీట్లు మరో ఏడాదిన్నర వరకు ఖాళీ లేకపోవడంతో చేయలేనని చెప్పేసింది. ఇప్పుడిక అంత క్రేజ్ వున్న హీరోయిన్ ఎవరా అని చూస్తున్నాడు. మరోవైపు అంధాధూన్‍లో టబు చేసిన క్యారెక్టర్‍కి నయనతారను అప్రోచ్ అయ్యాడని సమాచారం.
ఆమె తొమ్మిది కోట్ల పారితోషికం అడిగిందనే విచిత్రమైన వార్తలు ప్రచారమవుతున్నాయి. సింపుల్‍గా చేసేద్దామనుకున్న ఈ రీమేక్‍ని నితిన్ చాలా గ్రాండ్‍గా ప్లాన్ చేస్తున్నాడు. బడ్జెట్ ఎక్కువయినా ఫర్వాలేదు కానీ ఇందులో అంతా అదిరిపోయే కాస్టింగ్ వుండాలని ఫిక్స్ అయిపోయాడు. హిందీ వెర్షన్ చాలా మంది చూసేసి వుంటారు కనుక తెలుగు రీమేక్‍పై అంత పెట్టుబడి తెలివైన పని అవుతుందా లేదా అనేది రిలీజ్ అయితే కానీ తెలీదు.
This post was last modified on August 7, 2020 12:43 am
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…