దర్శకుడు అంటే పరిమితంగా మాట్లాడాలి. గుంభనంగా కనిపించాలి.. ఇలా రకరకాల రూల్స్ ఉంటాయి. బేసిగ్గా ఉత్సాహం ఎక్కువైనా.. వేరే కళలు ఏవైనా ఉన్నా కూడా వాటిని దాచుకుని కొంచెం హుందాగా.. గంభీరంగా ఉండటానికే ప్రయత్నిస్తారు డైరెక్టర్లు. కానీ కొంతమంది మాత్రం ఈ రూల్స్ అన్నీ బ్రేక్ చేసేస్తుంటారు. వారిలో ఎక్కడ లేని హుషారుంటుంది. తమలోని రకరకాల టాలెంట్లను సందర్భం వస్తే ప్రదర్శించడానికి వెనుకాడరు.
టాలీవుడ్ యువ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ కోవకే చెందుతాడు. అతను ఎక్కడున్నా అల్లరే అల్లరి అన్నట్లుంటుంది. కమెడియన్లను మించి అతనే ఎక్కువగా కామెడీ చేస్తుంటాడు. తన సినిమాలు, లేదా వేరే చిత్రాల ప్రమోషన్ల కోసం అతను చేసే ప్రమోషనల్ వీడియోలు భలే ఫన్నీగా ఉంటాయి. ఇక అనిల్ మంచి డ్యాన్సర్ అనే విషయంలో గతంలోనే కొన్ని సందర్భాల్లో రుజువైంది. మెగాస్టార్ చిరంజీవి హాజరైన ఒక వేడుకలో ఆయన స్టెప్‌ను అనుకరించి చూపించిన తీరుకు అందరూ ఆశ్చర్యపోయారు.
ఇప్పుడు మరోసారి తన డ్యాన్సింగ్ టాలెంట్ చూపించాడు అనిల్. ప్రస్తుతం అనిల్ రావిపూడి.. నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్‌లో అతను ఫైట్ మాస్టర్, డ్యాన్స్ మాస్టర్లతో కలిసి ఫేమస్ “బాలయ్యా బాలయ్యా” పాటకు డ్యాన్స్ వేయడం విశేషం. ఫైట్ మాస్టర్ ఓవర్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు.. డ్యాన్స్ మాస్టర్ కూడా జాయినయ్యాడు.. అని చెబుతూ.. అనిల్ వాళ్లతో కలిసి బాలయ్య పాటకు డ్యాన్స్ చేశాడు.
ఈ తరం కుర్రాడిలా చాలా స్టైలిష్‌గా డ్రెస్ చేసుకుని.. అంతే స్టైలిష్‌గా అనిల్ వేసిన స్టెప్పులు చూసి ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇప్పుడున్న స్టార్ దర్శకుల్లో ఇంత డ్యాన్సింగ్ టాలెంట్ ఉండి.. దాన్ని దాచుకోకుండా ఇలా ప్రదర్శించేవాళ్లు ఇంకెవరూ ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. అనిల్‌ను యూత్‌కు బాగా చేరువ చేసింది ఈ హుషారే. తాజా వీడియోలో అతడి టాలెంట్ చూశాక.. అనిల్ సినిమాలు తీయడమే కాదు.. అందులో నటించినా జనం చూస్తారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.
This post was last modified on May 18, 2023 10:19 am
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…