చిన్న సినిమాను ప్రమోట్ చేసి దాన్ని ఆడియన్స్ దాకా తీసుకెళ్లడం పెద్ద ప్రహసనంగా మారిపోతున్న ట్రెండ్ లో రైటర్ పద్మభూషణ్ ద్వారా దాన్ని విజయవంతంగా చేసి చూపించిన ఛాయ్ బిస్కెట్ టీమ్ ఇప్పుడు మేం ఫేమస్ తో వస్తోంది. సుమంత్ ప్రభాస్ ని హీరోగా దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందించిన ఈ మూవీ తాలూకు ట్రైలర్ ని హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో న్యాచురల్ స్టార్ నాని ముఖ్య అతిధిగా లాంచ్ చేయడంతో మూవీ లవర్స్ దృష్టి దీని మీద పడింది.
గత పది రోజులుగా సెలబ్రిటీలతో చేస్తున్న చిన్న వీడియో ప్రోమోలు ట్విట్టర్ లో బాగానే వైరల్ అయ్యాయి. ఇక కథ విషయానికి వస్తే తెలంగాణలో ఒక చిన్న పల్లెటూరు. ఉదయం లేచినప్పటి నుంచి బేవార్స్ గా తిరగడం తప్ప మరో పని లేని ముగ్గురు కుర్రాళ్లు. ఇంట్లో వాళ్ళతోనే కాదు బయటి జనాలతోనూ తిట్టించుకోవడం వీళ్ళ స్పెషాలిటీ. ఎంత ఖాళీగా ఉన్నా సరే ప్రేమలో పడి లవర్స్ ని సెట్ చేసుంటారు. అంతా బాగుందనుకుంటున్న టైంలో ఓ సమస్య వచ్చి పడుతుంది.
దీంతో సరదగా గడిచిపోతున్న ఈ త్రీ ఇడియట్స్ కి బాధ్యతలు వచ్చి పడతాయి. తమను తాము నిరూపించుకునేందుకు ఓ పని మొదలుపెడతారు. అదేంటి అందులో ఎలా ఫేమస్ అయ్యారో అదే అసలు ట్విస్టు. ఇది మరో నైజామ్ స్టోరీ. బలగం తరహాలో పూర్తిగా అదే యాస నేటివిటీతో తీశాడు సుమంత్ ప్రభాస్. జాతిరత్నాలు తరహా క్యారెక్టరైజేషన్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సరదాగా సాగిపోయే హాస్యం, సహజత్వం యూత్ ని ఆకట్టుకునేలా ఉన్నాయి. కళ్యాణ్ నాయక్ సంగీతం హుషారుగా సాగగా క్యాస్టింగ్ దాదాపుగా కొత్త మొహాలతోనే ఉన్నా యాక్టింగ్ పరంగా అనుభవమున్నవాళ్ళ లాగే చేశారు. టార్గెట్ చేసుకున్న యువతకి టైం పాస్ అయ్యేలా చూపిస్తూనే చివర్లో మంచి మెసేజ్ ఏదో దట్టించారు. కంటెంట్ కనక కలర్ ఫుల్ ఉంటే సమ్మర్ లో మరో సర్ప్రైజ్ హిట్ పడ్డట్టే.
This post was last modified on May 18, 2023 8:56 am
భారతదేశంలో పెట్టుబడుల ప్రవాహం కొత్త గమ్యస్థానాలను ఆకర్షిస్తోంది. తెలంగాణ తర్వాత మహారాష్ట్రలో కూడా అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) భారీ…
పల్నాడు జిల్లా దాచేపల్లిలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గ్రామ సచివాలయం-3 వెల్ఫేర్ అసిస్టెంట్ సంపతి లక్ష్మీప్రసాద్…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించి ప్రతీకారం…
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు మహిళా నేతలు అనూహ్యంగా లైమ్ లైట్ లోకి వచ్చారు. మొన్నటిదాకా తమ…
జనసేన తిరుపతి నేత కిరణ్ రాయల్ పై రేగిన వివాదం ఎట్టకేలకు సమసిపోయింది. రోజుల తరబడి ఏపీలో హాట్ టాపిక్…
బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోలకు బ్రేక్ ఇచ్చే బాధ్యతను తెలుగు దర్శకులు తీసుకున్నారు కాబోలు. యానిమల్ తో బాబీ డియోల్…