బాలీవుడ్ ఎవర్ గ్రీన్ కల్ట్ క్లాసిక్స్ లో డాన్ ది ప్రత్యేకమైన స్థానం. వెండితెరకు స్టయిలిష్ గ్యాంగ్ స్టర్ ని పరిచయం చేసింది ఈ సినిమానే. అమితాబ్ బచ్చన్ టాప్ 3 దీని చోటు శాశ్వతం. తమిళంలో రజనీకాంత్ బిల్లాగా, తెలుగులో ఎన్టీఆర్ యుగంధర్ గా రీమేక్ చేసి మంచి విజయాలు అందుకున్నారు. తిరిగి చాలా గ్యాప్ ఇచ్చి అజిత్ మళ్ళీ తీస్తే అదే స్థాయి ఫలితాన్ని అందుకుంది. ఆ రేంజ్ లో కాకపోయినా మెహర్ రమేష్ ప్రభాస్ తో చేసిన బిల్లా కూడా డీసెంట్ హిట్ దక్కించుకుంది. ఇవన్నీ ఒకే కథతో రూపొందినవి. హిందీలో షారుఖ్ ఖాన్ డాన్ రీమేక్ చేశాక డిఫరెంట్ స్టోరీతో డాన్ 2 చేసి సక్సెస్ అందుకున్నాడు
అప్పటి నుంచి దర్శకుడు ఫర్హాన్ అక్తర్ డాన్ 3 తీసే ప్లానింగ్ లో ఉన్నాడు. స్క్రిప్ట్ ని ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ తాజాగా దానికో రూపం తీసుకొచ్చాడని ముంబై టాక్. అయితే ఈ కొనసాగింపు పట్ల షారుఖ్ అంత ఆసక్తి చూపలేదని సమాచారం. ఇప్పుడతని స్థానంలో రణ్వీర్ సింగ్ అయితే ఎలా ఉంటుందనే ఆలోచనను ఫర్హాన్ సీరియస్ గానే చేస్తున్నారట. తొలుత హృతిక్ రోషన్ అనుకున్నప్పటికీ అతని డేట్లు ఇంకో నాలుగేళ్ల వరకు అందుబాటులో లేకపోవడంతో ఆంతదాకా వెయిట్ చేయడం కన్నా ఇంకో హీరోతో కొనసాగించడం మేలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది
వినడానికి బాగానే ఉంది కానీ డాన్ మేజిక్ ని కంటిన్యూ చేయడం అంత సులభం కాదు. అజిత్ డేవిడ్ బిల్లాగా కొనసాగింపు ట్రై చేశాడు కానీ కనీసం యావరేజ్ కూడా అందుకోలేకపోయాడు. షారుఖ్ డాన్ 2 సైతం ఇండస్ట్రీ హిట్టేం కాదు. కమర్షియల్ గా పాస్ అయ్యింది అంతే. అలాంటప్పుడు డాన్ 3 అంటే ఆషామాషీగా ఉండదు. నిర్మాతగా రితేష్ సిద్వాని ఫిక్స్ అయ్యారు. అయితే మూడో భాగంలో అమితాబ్, షారుఖ్, రణ్వీర్ లను ఒకేసారి తెరపై చూపాలన్న ఫర్హాన్ కల మాత్రం అంత సులభంగా నెరవేరేలా లేదట. బిగ్ బి కింగ్ ఖాన్ ఇద్దరూ ససేమిరా అన్నారట
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…