తమిళంలో విలక్షణ కథలను ఎంచుకుని కమర్షియల్ హిట్లు కొట్టిన దర్శకుడు వెంకట్ ప్రభు. ‘చెన్నై 28’ దగ్గర్నుంచి ‘మానాడు’ వరకు ఆయన సినిమాలన్నీ విభిన్నంగా సాగుతూనే మెజారిటీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు. ఇలాంటి మంచి ట్రాక్ రికార్డున్న దర్శకుడు.. మన టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్యతో జట్టు కట్టి తెలుగు, తమిళ భాషల్లో ‘కస్టడీ’ అనే సినిమా తీస్తుంటే.. ప్రత్యేక ఆసక్త ినెలకొంది.
ఈ సినిమాతో చైతూ తెలుగులో బలంగా బౌన్స్ బ్యాక్ అవుతాడని.. అలాగే తమిళంలోనూ మార్కెట్ సాధిస్తాడని అక్కినేని ఫ్యాన్స్ ఆశించారు. కానీ ఆ ఆశలు నెరవేరలేదు. చైతూ కెరీర్‌ను ఇంకా కిందికి లాగేసింది ‘కస్టడీ’. తమిళంలో కూడా ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేదు. మొత్తంగా చైతూ ఖాతాలో మరో డిజాస్టర్ జమ అయింది. ఈ సినిమాలో వెంకట్ ప్రభు మార్కే కనిపించకపోవడం ఆయన అభిమానులను ఆశ్చర్యపరిచింది.
ఇలాంటి డిజాస్టర్ తర్వాత ఏ దర్శకుడి కెరీర్ అయినా కొంచెం స్లో అవుతుంది. కానీ వెంకట్ ప్రభు విషయంలో మాత్రం దానికి భిన్నంగా జరగబోతోంది. ‘కస్టడీ ఫలితాన్ని పట్టించుకోకుండా ఆయనతో విజయ్ లాంటి టాప్ స్టార్ సినిమా చేయబోతున్నాడట. వీరి కలయికలో సినిమా దాదాపు ఓకే అయినట్లు చెబుతున్నారు.
ఈ సంక్రాంతికి ‘వారసుడు’తో పలకరించిన విజయ్.. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్‌తో ‘లియో’ చేస్తున్నాడు. అది దీపావళికి విడుదలవుతుంది. విజయ్ తర్వాతి సిినిమా ఏదీ ఇంకా ఖరారవ్వలేదు. ‘వారసుడు’ తీసిన వంశీ పైడిపల్లితోనే మరో సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. అది నిజం కాదని.. వెంకట్ ప్రభుతోనే విజయ్ జట్టు కట్టబోతున్నాడని కోలీవుడ్ వర్గాలు బలంగా చెబుతున్నాయి.
This post was last modified on May 20, 2023 1:38 pm
విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…
#AskKavitha- హ్యాష్ ట్యాగ్‌తో నెటిజన్ల నుంచి అభిప్రాయాలు సేకరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. ఇదే సమయంలో పలువురు నెటిజన్లు…
భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు…
మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…
నటుడిగా చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో విలన్ గా నటించి కంబ్యాక్ అయ్యాడు.…
హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…