నిన్న జరిగిన బేబీ మూడో లిరికల్ సాంగ్ విడుదలకు ముఖ్య అతిథిగా రష్మిక మందన్న రావడంతో ఒక్కసారిగా అభిమానుల అటెన్షన్ దీనిపైకి మళ్లింది. ఇప్పటికే వచ్చిన రెండు పాటలు మ్యూజిక్ లవర్స్ నుంచి మంచి మద్దతు దక్కించుకోగా ఈ మూడో విరహ గీతం కూడా హిట్ ట్రాక్ ఎక్కేలా ఉంది. విజయ్ బుల్గనిన్ సంగీతం సమకూర్చిన ఈ లవ్ స్టోరీని జూలై 14న విడుదల చేయబోతున్నారు. థియేట్రికల్ బిజినెస్ కు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఎస్కెఎన్ నిర్మాతగా కలర్ ఫోటో ప్రొడ్యూసర్ సాయిరాజేష్ దర్శకుడిగా మారి చేస్తున్న డెబ్యూ ఇదే. ప్రమోషన్లు బాగా చేస్తున్నారు
పెద్దగా బయటి ఈవెంట్లకు అంతగా రాని రష్మిక ప్రత్యేకంగా ఒక సాంగ్ కోసం విచ్చేయడం విశేషమే. అయితే బేబీ హీరో ఆనంద్ దేవరకొండ ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడం వల్లే వచ్చిందని ఇన్ సైడ్ టాక్. ఎందుకంటే అతని అన్నయ్య విజయ్ దేవరకొండతో ఆమెకున్న స్నేహం అందరికీ తెలిసిందే. వాళ్ళ బంధం గురించి ఓపెన్ గా ఎలాంటి స్టేట్ మెంట్స్ ఎప్పుడూ ఇవ్వలేదు కానీ తరచుగా కలిసి విదేశాలకు వెళ్లడం, ఫోటోలకు చిక్కడం తెలిసిందే. ఆ ఫ్రెండ్ షిప్ తోనే తమ్ముడికి ఈ హెల్ప్ చేయమని రౌడీ హీరో అడగటం ఓకే అనడం జరిగిపోయాయని వినికిడి.
ఏదైతేనేం ఈ గెస్ట్ విజిట్ హెల్ప్ చేసేదే. ఈ వేడుక తాలూకు వీడియోలు పిక్స్ సోషల్ మీడియాలో మెల్లగా వైరల్ అవుతున్నాయి. పుష్ప 2 కోసం హైదరాబాద్ లోనే అందుబాటులో ఉంటున్న రష్మిక మందన్న తన భాగం పూర్తి చేసుకునేందుకు ఎదురు చూస్తోంది. కీలకమైన పాటల చిత్రీకరణ సుకుమార్ ఇంకా ప్లాన్ చేయాల్సి ఉంది. శ్రీవల్లి, రారాస్వామిని మించేలా ఇందులో రెండు సాంగ్స్ ఉంటాయని వాటి రిహార్సల్స్ కే ఎక్కువ టైం పట్టేలా ఉందని మరో న్యూస్. మొత్తానికి బేబీకి కావాల్సిన హైప్ సంగీతం ఒకవైపు ఇస్తుండగా మరోవైపు రష్మిక లాంటివాళ్ళు అండగా నిలబడుతున్నారు
This post was last modified on May 17, 2023 12:51 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…