డెబ్యూతోనే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకోవడం అందరికీ జరగదు. ఉప్పెన వచ్చినప్పుడు హీరోయిన్ కృతి శెట్టి ఇండస్ట్రీలోనే కాదు యూత్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. దెబ్బకు డిమాండ్ అమాంతం పెరిగిపోయి దర్శక నిర్మాతలు క్యూ కట్టేశారు. ఇప్పుడు శ్రీలీల ఏదైతే స్టార్ డం చూస్తుందో దాని అంతకు ముందే కృతి ఎంజాయ్ చేసింది. శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు సక్సెస్ ల తర్వాత తనకిక తిరుగే లేదనుకున్నారు. కట్ చేస్తే వరసగా నాలుగు డిజాస్టర్లు పడి మార్కెట్ ని బాగా తగ్గించాయి. తాజాగా ఎన్నో ఆశలు పెట్టుకున్న కస్టడీ తీవ్రంగా నిరాశపరిచింది
దీనికన్నా ముందు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం మూడూ ఒకదాన్ని మించి మరొకటి దెబ్బ కొట్టాయి. మధ్యలో తమిళ స్టార్ హీరో సూర్యకు జోడిగా బాలా దర్శకత్వంలో మొదలుపెట్టిన ప్రాజెక్ట్ కొద్దిరోజులకే ఆగిపోయి క్యాన్సిల్ కావడం మరో ట్విస్ట్. ఒకవేళ అది పూర్తయ్యి ఉంటే కోలీవుడ్ లో గుర్తింపుతో పాటు బాలా కాబట్టి నటన పరంగా ఛాలెంజ్ ఉన్న క్యారెక్టర్ దక్కేది. అదీ మిస్ అయ్యింది. ఇప్పుడు శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో శర్వానంద్ హీరోగా రూపొందుతున్న చిత్రం మీదే తన ఆశలన్నీ. టోవినో థామస్ తో మలయాళం డెబ్యూ కూడా చేస్తోంది.
ఈ రెండు బ్లాక్ బస్టర్ అయితేనే తిరిగి స్టార్ హీరోల సరసన అవకాశాలు పట్టొచ్చు. సక్సెస్ మాత్రమే మాట్లాడే పరిశ్రమలో ఇలా ఇన్నేసి ఫ్లాపులతో బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరో అయితే నెట్టుకువస్తాడేమో కానీ అది హీరోయిన్లకు సాధ్యం కాదు. అసలే శ్రీలీల దూసుకుపోతోంది. చేతిలో పదేసి సినిమాలతో ఎవరూ లేనంత బిజీగా అందరి సరసన అవకాశాలు పట్టేస్తోంది. ఒకపక్క పూజా హెగ్డే లాంటి టాప్ బ్యూటీనే రేస్ లో వెనుకబడి మహేష్ బాబు 28ని నమ్ముకుంది. అలాంటిది కృతి శెట్టికి ఇలా డౌన్ అవుతున్న గ్రాఫ్ ఖచ్చితంగా రిస్క్ లో పెట్టేదే. చూడాలి మరి ఏది బ్రేక్ ఇస్తుందో
This post was last modified on May 17, 2023 12:16 pm
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…