‘బాహుబలి’లో ఎన్నో అద్భుత యాక్షన్ విన్యాసాలు చూపించాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఐతే ‘ది కంక్లూజన్’ క్లైమాక్స్‌లో ఒక సన్నివేశం మాత్రం మరీ అతిగా అనిపించింది. తాటి చెట్లను రబ్బరు తరహాలో పూర్తిగా పక్కకు వంచి.. దాని మీద బాహుబలి సైన్యం ఎక్కి లాగి చెట్లను విడిచి పెడితే అవి విసిరి కొట్టినట్లుగా వెళ్లడం బాహుబలి అనుచరులు నేరుగా కోటలోకి వెళ్లిపడటం.. ఇదంతా చూసి ప్రేక్షకులు నవ్వుకున్నారు.
ఎంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నప్పటికీ తాటి చెట్లు ఇలా వంగడమేంటి.. వాటి మీద ప్రయాణించి సైనికులు కోటలోకి వెళ్లడమేంటి అనుకున్నారందరూ. కానీ ఇప్పుడు ముంబయి వరదల ధాటికి అక్కడి కొబ్బరి చెట్లు, తాటి చెట్లు ఊగుతున్న దృశ్యాలు కొన్ని సోషల్ మీడియాలో చూసిన వాళ్లకు బాహుబలిలో చూపించింది మరీ అతిశయోక్తి లాగా ఏమీ అనిపించలేదు. వర్షానికి తోడు ఈదురు గాలులు కూడా తోడవడంతో ముంబయిలోని ఓ ప్రాంతంలో ఓ కొబ్బరి చెట్టు గడ్డి పోచ తరహాలో ఊగిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కనిపిస్తోంది.
దీన్ని చూసిన ఓ నెటిజన్.. రాజమౌళికి సారీ చెప్పాడు. బాహుబలిలో చూపించిన దృశ్యాల్ని చూసి కామెడీ చేశానని.. జక్కన్నను ఎగతాళి చేశానని.. కానీ ఈ దృశ్యం చూస్తే అదేమీ అతిశయోక్తిలా లేదని అన్నాడు. ముంబయిలో వర్షం, గాలుల భీభత్సం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇది ఉదాహరణ. అక్కడి ప్రఖ్యాత డీవై పాటిల్ స్టేడియం కూడా దారుణంగా దెబ్బ తింది. పైకప్పు సహా అన్నీ ధ్వంసమయ్యాయి. ఇంకా నగర వ్యాప్తంగా ఎన్నో భవనాలు, ఇతర నిర్మాణాలు దారుణాతి దారుణంగా దెబ్బ తిన్నాయి. వందల కోట్ల నష్టం వాటిల్లింది. అసలే కరోనా ధాటికి అల్లాడుతున్న ముంబయిని వర్షాలు మరింత విషాదంలో ముంచెత్తుతున్నాయి.
This post was last modified on August 7, 2020 12:02 am
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…