ఉప్పెన లాంటి బ్లాక్‌బస్టర్ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు మెగా కుర్రాడు పంజా వైష్ణవ్ తేజ్. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ సహా ఏ అరంగేట్ర హీరోకూ సాధ్యం కాని వసూళ్లను తన తొలి చిత్రంతో అతను సాధించగలిగాడు. అది పూర్తిగా అతడి ఘనత అని చెప్పలేం కానీ.. ఊహించని రికార్డులైతే తన పేరు మీద నమోదయ్యాయి. కానీ ఈ సక్సెస్‌ను అతను నిలబెట్టుకోలేకపోయాడు.
వైష్ణవ్ తర్వాతి రెండు చిత్రాలు కొండపొలం, రంగ రంగ వైభవంగా చేదు అనుభవాలను మిగిల్చాయి. ఇప్పుడు అతడి ఆశలన్నీ సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడితో చేస్తున్న ఆదికేశవ మీదే ఉన్నాయి. ఈ రోజే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ టీజర్ లాంచ్ చేశారు. ఈసారి వైష్ణవ్ పూర్తి స్థాయి మాస్ సినిమా చేస్తున్న సంకేతాలను ఈ టీజర్ ఇచ్చింది. కానీ ఈ టీజర్ చూసిన వాళ్లకు కొన్ని భయాలు కూడా కలిగాయి.
గుడిని టార్గెట్ చేసే విలన్ బ్యాచ్.. వారిని అడ్డుకుని గుడికి రక్షణగా నిలిచే హీరో.. ఇదీ టీజర్లో కనిపించిన లైన్. ఇదే లైన్ గత ఏడాది ఆచార్య సినిమాలో చూశాం. చిరంజీవి నటించిన ఆ చిత్రం మెగా అభిమానులకు ఒక పీడకలలా మిగిలిపోయింది. వైష్ణవ్ కూడా మెగా ఫ్యామిలీ హీరోనే కావడం.. స్టోరీ లైన్ ఆచార్యకు దగ్గరగా ఉండటంతో ఆ సినిమా తాలూకు చేదు అనుభవాలన్నీ గుర్తుకు వస్తున్నాయి.
స్టోరీ లైన్ దగ్గరగా ఉన్నంతమాత్రాన సినిమా కూడా అలాంటి ఫలితాన్నే అందుకుంటుందని చెప్పలేం కానీ.. మెగా అభిమానులైతే కొంత కంగారు పడుతున్నారు. టీజర్‌లో అంతగా కొత్తదనం ఏమీ కూడా కనిపించలేదు. మరి త్రివిక్రమ్ ఓకే చేసి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న సినిమా కాబట్టి కంటెంట్ ఉన్నదే అయి ఉంటుందని ఆశిస్తున్నారు. చూద్దాం ఏమవుతుందో. ఈ చిత్రం జులైలో విడుదల కానుంది.
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…