Movie News

ఏజెంట్ డిజాస్టర్ పట్ల అఖిల్ స్పందన

ఏజెంట్ డిజాస్టర్ ఫలితం తెలియడం ఆలస్యం రెండో రోజే దుబాయ్ వెళ్ళిపోయిన అఖిల్ ఎట్టకేలకు ట్విట్టర్ వేదికగా మనసు విప్పాడు. ఇంకో మూడు రోజుల్లో ఓటిటి స్ట్రీమింగ్ ఉన్న నేపథ్యంలో ఇలా ఓపెన్ కావడం విశేషం. సాధారణంగా యూత్ హీరోలు ఇంత పెద్ద ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మౌనంతో కూడిన గ్యాప్ తీసుకోవడం సహజం. అందులోనూ అఖిల్ చాలా కష్టపడి చేసిన ప్యాన్ ఇండియా మూవీ ఇది. కనీసం యావరేజ్ అయినా ఫ్యాన్స్ ఇంత బాధపడే వారు కాదు. కానీ కనీసం సగం కూడా రికవరీ చేయలేనంత బ్యాడ్ గా ఫ్లాప్ కావడం అనూహ్యం. ఇంతకీ అఖిల్ ఏమన్నాడు

నా ప్రియమైన అభిమానులకు శ్రేయోభిలాషులకు ఇదే నా సందేశం. ఏజెంట్ కి ఒక రూపం తీసుకురావటానికి తమ జీవితాలని అంకితం చేసి కష్టపడిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా శాయశక్తులా మేం బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నించాం. కానీ దురదృష్టవశాత్తు మేము కోరుకున్నట్టు అది తెరపై ఆవిష్కృతం కాక మంచి సినిమా ఇవ్వలేకపోయాం. నాకు పూర్తి మద్దతుగా నిలిచిన నిర్మాత అనిల్ సుంకరకు స్పెషల్ థాంక్స్ చెబుతున్నాను. మమ్మల్ని నమ్మిన డిస్ట్రిబ్యూటర్లు, సపోర్ట్ చేసిన మీడియా అందరికీ ధన్యవాదాలు. ఇంత ప్రేమ ఎనర్జీని ఇచ్చినందుకు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మెరుగైన సినిమాతో వచ్చేందుకు ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెడతాను.

చాలా స్పష్టంగా అఖిల్ అక్కినేని తన మనసులో మాటలను చెప్పేశాడు. ఎక్కడా దర్శకుడు సురేందర్ రెడ్డి పేరుని నేరుగా ప్రస్తావించకపోవడం గమనార్హం. ఓటమిని ఒప్పుకోవడం అవసరమే. ముందు ముందు తప్పులు చేయకుండా ఇది పాఠం నేర్పిస్తుంది. వీలైనంత త్వరగా యువి క్రియేషన్స్ బ్యానర్ లో కొత్త దర్శకుడితో చేతులు కలపబోతున్న అఖిల్ దాని కోసం రెడీ అవుతున్నాడు. గత కొన్నేళ్లలో నిర్మాతతో పాటు హీరో ఇద్దరూ పబ్లిక్ ప్లాట్ ఫార్మ్ మీద తమ డిజాస్టర్ ని ఒప్పుకోవడం ఏజెంట్ విషయంలోనే జరిగింది. ఈ నిజాయితీ ఇకనైనా హిట్ ఇవ్వాలి

This post was last modified on May 15, 2023 9:56 pm

Share

Recent Posts

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

2 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

3 hours ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

4 hours ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

4 hours ago

పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…

4 hours ago

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

5 hours ago