సినిమాలకు బాగా కలిసొచ్చే లాంగ్ సీజన్ సమ్మర్. ఐతే కరోనా వల్ల రెండు సమ్మర్ సీజన్లు వేస్ట్ అయిపోయాయి. గత ఏడాదే మళ్లీ సాధారణ స్థితి రాగా.. భారీ అంచనాలు పెట్టుకున్న ఆచార్య, సర్కారు వారి పాట లాంటి చిత్రాలు తీవ్ర నిరాశకు గురి చేశాయి. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 లాంటి భారీ చిత్రాలు మాత్రం బాగానే అలరించాయి.
ఈ సారి వేసవి మరింత హీటెక్కుతుందని అనుకుంటే.. ఈ సీజన్‌కు షెడ్యూల్ అయిన భారీ చిత్రాలు ఒక్కొక్కటిగా రేసు నుంచి తప్పుకున్నాయి. ఏ పెద్ద స్టార్ సినిమా లేని అరుదైన సమ్మర్ సీజన్ ఇదే అయింది. పోనీ మిడ్ రేంజ్ సినిమాలైనా ప్రేక్షకులను అలరిస్తున్నాయా అంటే అదీ లేదు. దసరా, విరూపాక్ష మాత్రమే ఆదరణ దక్కించుకున్నాయి. మిగతా సినిమాలన్నీ దారుణమైన ఫలితాలందుకున్నాయి. గత మూడు వారాలుగా పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఏజెంట్, రామబాణం, కస్టడీ లాంటి క్రేజున్న సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ఉగ్రం కాస్త పర్వాలేదనిపించింది.
వేసవి సీజన్ ముందుకు సాగేకొద్దీ కళ తప్పుతోంది. ఇలాంటి టైంలో ఒక చిన్న సినిమా ఆశలు రేపుతోంది. అదే.. అన్నీ మంచి శకునములే. టాలెంటెెడ్ ఫిలిం మేకర్ నందిని రెడ్డి రూపొందించిన ఈ చిత్రంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించారు.
పేరుకే చిన్న సినిమా కానీ.. వైజయంతీ వారు చేసిన అగ్రెసివ్ ప్రమోషన్ల వల్ల.. ఆసక్తికర ప్రోమోల వల్ల ప్రేక్షకుల్లో ఈ చిత్రం బాగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తున్న ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతను కూడా థియేటర్లకు రప్పించేలా కనిపిస్తోంది. కావాల్సిందల్లా.. మంచి టాక్ మాత్రమే. గురువారం రిలీజ్ కానున్న ఈ చిత్రానికి ఆ టాకే వస్తే బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయాన్నే అందుకునే అవకాశముంది. ఈ వారం డబ్బింగ్ మూవీ బిచ్చగాడు-2 కూడా వస్తున్నప్పటికీ దాని మీద పెద్దగా అంచనాలు లేవు.
This post was last modified on May 15, 2023 4:15 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…