దేవర.. ఈ మాట వింటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఒక ఉత్సాహం వస్తుంది. పవన్ వీరాభిమానిగా చెప్పుకునే నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. ఆయన్ని ఎప్పుడూ ఇదే పేరుతో పిలుస్తుంటాడు. పవన్‌ను దేవుడు, దేవర అని సంబోధిస్తూ అభిమానులకు కూడా అదే అలవాటు చేశాడు.
మంచి సౌండింగ్ కూడా ఉన్న ‘దేవర’ అనే టైటిల్‌ను పవన్ సినిమాకు దేనికైనా వాడుకుంటే బావుంటుందని అభిమానులు అంటూ ఉంటారు. సాయిధరమ్ తేజ్‌తో కలిసి పవన్ నటిస్తున్న సినిమాకు ఈ టైటిల్ యాప్ట్ అని, ఇదే పేరును ఖరారు చేయొచ్చని ఒక దశలో ప్రచారం జరిగింది కూడా. కానీ ఆ టీం వేరే టైటిల్ మీద దృష్టిపెట్టింది. క్రేజీగా అనిపించే ‘దేవర’ టైటిల్ మీద ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త సినిమా బృందం కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి ‘దేవర’ పేరునే పరిశీలిస్తున్నారట.
సముద్ర తీరంలో ఉండే ఒక సమూహాన్ని కాపాడే రక్షకుడి పాత్రను కొరటాల శివ సినిమాలో చేస్తున్నాడట తారక్. ఈ కథకు ‘దేవర’ అనే టైటిల్ సూటవుతుందని.. అది మాస్‌కు ఈజీగా ఎక్కుతుందని అనుకుంటున్నారట. టైటిల్ రిజిస్టర్ చేయించే ప్రయత్నం కూడా జరుగుతున్నట్లు సమాచారం. ఒకవేళ తారక్ సినిమాకే ఇదే పేరు ఖరారైతే మాత్రం పవన్ ఫ్యాన్స్ కొంచెం ఫీలవుతారనడంలో సందేహం లేదు. ఆ పేరుతో వారికి అలాంటి ఎమోషనల్ కనెక్షన్ ఉంది.
రకరకాల కారణాల వల్ల సెట్స్ మీదికి వెళ్లడంలో ఆలస్యం జరిగింది కానీ.. ఒకసారి షూట్ మొదలయ్యాక టీం అంతా మంచి ఉత్సాహంతో పని చేస్తోంది. ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. కొత్త షెడ్యూల్ నడుస్తోంది. భారీ బడ్జెట్లో, పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మే 5కు రిలీజ్ చేయాలన్నది ప్లాన్. ఇందులో తారక్ సరసన జాన్వి కపూర్ నటిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
This post was last modified on May 15, 2023 1:38 pm
అరవింద సమేత.. మహర్షి.. గద్దలకొండ గణేష్.. అల వైకుంఠపురములో... ఇలా ఒక టైంలో తెలుగులో వరుస సక్సెస్లతో తిరుగులేని క్రేజ్…
భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ తన అద్భుతమైన ప్రదర్శనతో టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.…
1995 దాకా దేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కొనసాగించింది కేవలం పరిపాలన మాత్రమే. అయితే 1995లో…
ముంబయిలో జరిగిన ఐదో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసి, కేవలం 37…
ఒక్కోసారి ఛాయాచిత్రాలు పెద్ద కథలు చెబుతాయి. నిన్న సందీప్ రెడ్డి వంగా అలాంటి చర్చకే చోటిచ్చారు. తన ఆఫీస్ తాలూకు…
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు వేదికపైకి వచ్చినప్పుడు ఆయన గురించి అల్లు అరవింద్ చెప్పిన మాటలు…