ప్రభాస్ ఇప్పుడు మామూలు దూకుడు మీద లేడు. అతను నటించిన మూడు భారీ చిత్రాలు అటు ఇటుగా ఏడు నెలల వ్యవధిలో రాబోతున్నాయంటేనే తనెంత వేగంగా సినిమాలు చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఆదిపురుష్ విడుదలకు సరిగ్గా ఇంకో నెల రోజుల సమయమే ఉంది. ఆ చిత్రం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న సంగతి తెలిసిందే.
ఐతే దీని తర్వాత సెప్టెంబరు 28కి షెడ్యూల్ అయిన ‘సలార్’ విషయంలో రెండు రోజులుగా జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ చిత్రం అనుకున్న ప్రకారం విడుదల కాకపోవచ్చని.. వచ్చే సంక్రాంతికి వాయిదా పడుతోందని.. దీంతో ఆ పండక్కి షెడ్యూల్ అయిన ‘ప్రాజెక్ట్-కే’ వెనక్కి వెళ్లబోతోందని రూమర్లు ఊపందుకున్నాయి. కానీ ‘సలార్’ టీం ఈ ప్రచారాన్ని ఖండించింది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న హోంబలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరగందూర్ ఈ మేరకు స్పష్టతను ఇచ్చాడు.
సలార్‌ను ముందు నుంచి అనుకుంటున్న ప్రకారమే సెప్టెంబరు 28న విడుదల చేయబోతున్నట్లు విజయ్ స్పష్టం చేశాడు. ఈ అప్‌డేట్ ప్రభాస్ అభిమానులను ఎగ్జైట్ చేస్తోంది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ సినిమాల్లో అత్యధిక అంచనాలున్న సినిమా ఇదే. సాహో, ఆదిపురుష్, ప్రాజెక్ట్-కే దాంతో పోలిస్తే భారీ బడ్జెట్లో తెరకెక్కిన, పెద్ద కాన్వాస్ ఉన్న సినిమాలే కానీ.. ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్.. ప్రభాస్ లాంటి మాచో స్టార్‌తో తీసిన సినిమా కావడంతో ‘సలార్’ మాస్‌ను ఊపేసి.. బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం అనే అంచనాలున్నాయి.
ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేయగలదని భావిస్తున్నారు. ప్రభాస్ అసలైన స్టామినా ఏంటో ఈ సినిమా చూపిస్తుందని అభిమానులు ధీమాగా చెబుతున్నారు. అందుకే ఈ సినిమా కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇంకో నాలుగు నెలల్లోనే ఈ సినిమా రిలీజ్ కానుందన్న సమాచారం ప్రభాస్ అభిమానులను నిలవనీయట్లేదు.
This post was last modified on May 15, 2023 1:44 pm
పెద్దికి అంత కష్టపడినా ప్యాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ దక్కలేదనే అసంతృప్తి అభిమానుల్లో ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు…
ఎవరి రికమండేషన్ అవసరం లేదు... ఎవరూ సిఫార్సు చేయక్కర్లేదు. నేరుగా మీకు నామినేటెడ్ పదవి ఇవ్వడం జరుగుతుంది. కాకపొతే మీరు…
నరేంద్ర మోదీ... ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆధునిక భారత దేశంలో అత్యంత ప్రభావవంతుడైన నాయకుడు... పాలకుడు. దేశంలో కొట్లాది మంది…
జిమ్ జిమ్ తార.. గత నాలుగైదు రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లో…
తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన... స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)లో 73 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఇది జరిగి…
ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ మంచి ఊపులో సాగుతుంటే వాళ్లు పెళ్లి జోలికి వెళ్లేవాళ్లు కాదు. అవకాశాలు తగ్గిపోయి, ఫేడవుడ్ అవుతున్న…