సినిమా నిర్మాణంలో బడ్జెట్ కంట్రోల్ తప్పకుండా బాధ్యత వహించాల్సింది ముందుగా దర్శకుడే. ఈ విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఆ మధ్య వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ లో చిరంజీవి నొక్కి వక్కాణించింది ఇదే. అనిల్ సుంకరకు ఏజెంట్ చేయి దాటిపోవడానికి కారణాల్లో ఇదే ప్రధానమైంది. స్క్రిప్ట్ దశలోనే రాసుకున్న సన్నివేశాలన్నీ తీయాలా వద్దా అనేది ముందుగా ఆలోచించకుండా తర్వాత ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోత వేయడం వల్ల ప్రొడ్యూసర్ నష్టపోతున్న మొత్తం లక్షల నుంచి కోట్ల దాకా పెరుగుతోంది. ఎంత డిజిటలైనా వేస్టేజ్ ఫ్రీ కాదుగా.
ఇటీవలే విడుదలై గోపీచంద్ కు మరో ఫ్లాప్ మిగిల్చిన రామబాణంలో డిలీట్ చేసిన సీన్లను ఒక్కొక్కటిగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేస్తున్నారు. ఇప్పటిదాకా నాలుగొచ్చాయి. మొత్తం నిడివి అక్షరాలా 16 నిమిషాలకు పైగానే ఉంది. ఇంకా ఎన్ని ఉన్నాయో వేచి చూడాలి. అందులో పోసాని కృష్ణమురళి పాల్గొన్న ఓ కీలకమైన సీన్ ఉంది. కానీ మూవీలో లేదు. అంటే ఆయన కాల్ షీట్ వృథా అయినట్టే. ఇంత లెన్త్ లో చిత్రీకరణ అంటే ఉట్టి లక్షల్లో జరిగే వ్యవహారం కాదు. శ్రీవాస్ ఈ విషయంలో తగినంత కేర్ తీసుకోలేదనే కనిపిస్తోంది.
ప్రతి సినిమాకు ఇలాంటి కోతలు ఉంటాయి కానీ మరీ ఎక్కువ మోతాదులో ఉండటం మంచిది కాదు. ఒక్కసారి బౌండ్ స్క్రిప్ట్ ని లాక్ చేసుకున్నాక అవసరం లేనివేవో ముందే గుర్తించాలి. దాని వల్ల ఖర్చు తగ్గి నిర్మాతకు సౌలభ్యం పెరుగుతుంది. అంతే తప్ప ఇలా ఉచితంగా ఆన్ లైన్లో వదలడం వల్ల మిలియన్ల వ్యూస్ రావొచ్చేమో కానీ కోల్పోయిన డబ్బు మొత్తం వెనక్కు రాదు. కనీస స్థాయిలో ఆడుతుందనుకున్న రామబాణం మరీ తీవ్రంగా నిరాశపరచడం గోపీచంద్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మళ్ళీ హిట్టు ఎప్పటికి దక్కేనోనని నిట్టూరుస్తున్నారు
This post was last modified on May 15, 2023 11:16 am
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…