బిచ్చగాడు వచ్చి ఎనిమిదేళ్లయ్యింది. అయినా తెలుగునాట దాని బ్రాండ్ ఇంకా బలంగా ఉందని చెప్పడానికి నిదర్శనం సీక్వెల్ కి జరుగుతున్న బిజినెస్. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఏపీ తెలంగాణ కలిపి డబ్బింగ్ వెర్షన్ కు సుమారు 6 కోట్లకు థియేట్రికల్ రైట్స్ విక్రయించారట. అంటే లాభాలు రావాలంటే ఇంకో కోటి కలుపుకుని మొత్తం షేర్ రూపంలో వసూలు చేయాలి. ఇది భారీ టాస్కే. షూటింగ్ జరుగుతున్న టైంలో పెద్దగా బజ్ లేదు కానీ ట్రైలర్ వచ్చాక అంచనాలు పెరిగాయి. ఈసారి తల్లికి బదులు చెల్లి సెంటిమెంట్ ని తీసుకొచ్చారు.
బిచ్చగాడు 2 మీద బయ్యర్లు ఇంతగా నమ్మకం పెట్టుకోవడానికి కారణాలు లేకపోలేదు. గత రెండు మూడు వారాలుగా బాక్సాఫీస్ వద్ద మాస్ కి ఫ్యామిలీస్ కి ఒకేసారి రీచ్ అయ్యే కంటెంట్ ఉన్న సినిమాలు రాలేదు. ఏజెంట్ తో మొదలుపెట్టి కస్టడీ దాకా అన్నీ డిజాస్టర్లే. ది కేరళ స్టోరీ దేశం మొత్తం ప్రభంజనం సృష్టించినా ఇక్కడ మరీ అద్భుతాలేం చేయడం లేదు. వచ్చే వారం 18న అన్నీ మంచి శకునములే వస్తోంది. ఇది పూర్తిగా కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చేసుకుంది. టాక్ బాగున్నా బిచ్చగాడు 2కి వచ్చిన ఇబ్బందేమీ లేదు. థియేటర్ల సమస్య అసలే ఉండదు.
ఈ క్యాలికులేషన్ల దృష్ట్యా బిచ్చగాడు 2 సేఫ్ గేమ్ అవుతుందనే లెక్కలో డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. అయితే విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో తనే సంగీతం అందించి నిర్మించిన ఈ ఎమోషనల్ డ్రామాని ఎంత మేరకు హ్యాండిల్ చేశాడనే దాని మీదే హిట్ కొట్టడం ఆధారపడి ఉంటుంది. బిచ్చగాడు తర్వాత ఈ హీరోకి తెలుగులో కనీసం యావరేజ్ హిట్ దక్కలేదు. చాలా సినిమాలు వచ్చాయి కానీ ఏవీ కనీస స్థాయిలో ఆడలేదు. ఇంత డిజాస్టర్ ట్రాక్ రికార్డుతోనూ ఆరు కోట్లంటే మాటలు కాదు. మరి అంత మొత్తాన్ని రాబడితే మాత్రం మళ్ళీ మార్కెట్ పుంజుకుంటుంది
This post was last modified on May 15, 2023 6:10 am
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…
లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…