రీ రిలీజ్ సినిమాల విషయంలో ఏడాదిగా ఎన్నడూ లేని హంగామా చూస్తున్నాం. టాలీవుడ్లో పాత సినిమాలను అప్పుడప్పుడూ రీ రిలీజ్ చేయడం కొత్తేమీ కాదు కానీ.. గత ఏడాది కాలంలో చూసిన హంగామా మాత్రం నభూతో అనే చెప్పాలి. కొత్త సినిమాల తరహాలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం.. థియేటర్లలో అభిమానులు హోరెత్తించేయడం.. కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేయడం.. థియేటర్ల బయట, లోపల సంబరాలు మిన్నంటడం.. ఇదంతా చూసేవారికి ఆశ్చర్యం కలిగిస్తోంది. అభిమానులు దీన్ని భలేగా ఎంజాయ్ చేస్తున్నారు.
రీ రిలీజ్‌ల పరంగానూ రికార్డుల కోసం గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే మహేష్, పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ రీ రిలీజ్ హంగామాను పీక్స్‌కు తీసుకెళ్లి తమ సత్తా ఏంటో చూపించారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల వంతు వచ్చింది. ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ‘సింహాద్రి’ రీ రిలీజ్ ఒక రేంజిలో ప్లాన్ చేశారు అభిమానులు.
దీని కోసం ప్లానింగ్ రెండు నెలల నుంచి జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యుఎస్‌లో భారీ స్థాయిలో ‘సింహాద్రి’ స్పెషల్ షోలు భారీగా ప్లాన్ చేశారు అభిమానులు. దీని కోసం ప్రమోషన్ కూడా గట్టిగా జరుగుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మంచి ఊపుమీదున్నాయి.
విశేషం ఏంటంటే.. ఒక రీ రిలీజ్ సినిమాకు తొలిసారిగా ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా చేస్తున్నారు అభిమానులు. ఇందుకు వేదిక కూడా ఖరారైంది. మామూలుగా కొత్త సినిమాలకు ప్రి రిలీజ్ ఈవెంట్లు నిర్వహించే హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్లోనే ఈ వేడుక కూడా చేస్తున్నారు. ఈ నెల 17న ఈవెంట్ జరగబోతోంది.
దీని కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు. అభిమానుల సందడి వేరే లెవెల్లో ఉండేలా ఉంది ఈ వేడుకలో. ఎవరైనా ప్రముఖులే ఈ వేడుకకు అతిథిులుగా వస్తారని భావిస్తున్నారు. ఈ హంగామా అంతా చూస్తుంటే రీ రిలీజ్ రికార్డులన్నింటినీ ‘సింహాద్రి’ బద్దలు కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
This post was last modified on May 14, 2023 1:31 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…