టాలీవుడ్లో హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుపోయే హీరోల్లో మాస్ రాజా రవితేజ ఒకడు. దసరా, వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్‌బస్టర్ల తర్వాత ఇటీవలే ‘రావణాసుర’తో ఎదురు దెబ్బ తిన్న రవితేజ.. దాన్నుంచి మూవ్ ఆన్ అయిపోయి రెండు సినిమాల షూటింగ్‌లో సమాంతరంగా పాల్గొంటున్నాడు.
వంశీ ఆకెళ్ళ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ చేస్తూనే.. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేనితో ‘ఈగల్’ అనే మూవీలోనూ నటిస్తున్నాడు మాస్ రాజా. ఇప్పుడు ఆయన కొత్త సినిమా ఖరారైనట్లు సమాచారం. ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేసే రవితేజ.. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ చేయబోతున్నాడిప్పుడు.
ఆయన యువ దర్శకుడు అనుదీప్ కేవీతో జట్టు కట్టబోతున్నాడు. ‘జాతిరత్నాలు’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన అనుదీప్.. ఆ తర్వాత ‘ప్రిన్స్’తో నిరాశపరిచాడు. అయినా అతణ్ని నమ్మి సినిమా చేయబోతున్నాడు రవితేజ.
‘జాతిరత్నాలు’తో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న అనుదీప్.. అనవసరంగా తమిళ హీరో శివ కార్తికేయన్‌తో జట్టు కట్టాడు. ‘జాతిరత్నాలు’ తరహాలోనే కామెడీ పండించడానికి ప్రయత్నించాడు కానీ.. అతడి టైమింగ్‌కు తమిళ హీరో సెట్ కాలేదు. మన హీరోలతో.. ఇక్కడి నేటివిటీతో అతను సినిమా చేస్తేనే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది.
‘ప్రిన్స్’ పోయిందని అనుదీప్ మీద తెలుగు ప్రేక్షకులకేమీ నమ్మకం పోలేదు. అతను మళ్లీ తన మార్కు సినిమా తీయగలడనే నమ్ముతున్నారు. రవితేజ ఆ నమ్మకంతోనే అతడికి అవకాశం ఇచ్చినట్లు సమాచారం. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడట. రవితేజ పక్కన కొంచెం సీనియర్ అయిన హీరోయిన్నే పెట్టుకోవాలని చూస్తున్నారట. తమన్నా, త్రిషల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వస్తుందట.
This post was last modified on May 14, 2023 6:02 pm
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…