ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల్లో మంచి స్పీడు మీదున్నది పవన్ కళ్యాణ్, ప్రభాస్‌లే. మామూలుగా వీళ్లిద్దరూ నెమ్మదిగా సినిమాలు చేసేవాళ్లే. కానీ ఇప్పుడు వీళ్లు ఒకేసారి మల్టిపుల్ ప్రాజెక్టుల్లో పని చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా ఇమేజ్ ఉచ్చులో చిక్కుకుని కొంచెం నెమ్మదించిన ప్రభాస్.. తర్వాత స్పీడు పెంచేశాడు.
ఆల్రెడీ ‘ఆదిపురుష్’ను పూర్తి చేసి.. ‘సలార్’ను కూడా ఒక కొలిక్కి తెచ్చేశాడు. మారుతి సినిమా కూడా చకచకా రెడీ అవుతోంది. ‘ప్రాజెక్ట్-కే’ కోసం కూడా వీలైనన్ని ఎక్కువ డేట్లు ఇచ్చి దాన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు ప్రభాస్. ఇలా తీరిక లేకుండా సినిమాలు చేస్తూనే.. మరోవైపు కొత్త కథలు వింటున్నాడు ప్రభాస్. ఐతే ప్రభాస్ తన సన్నిహితుల దగ్గర చెబుతున్న మాట ఏంటంటే.. తాను పాన్ ఇండియా స్టార్ అయ్యాక అందరూ ఎక్కువగా పెద్ద కాన్వాస్ ఉన్న యాక్షన్ కథలే చెబుతున్నారని.
ఇమేజ్ ఛట్రం నుంచి బయటపడి.. మళ్లీ డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి తరహాలో ఫ్యామిలీ టచ్ ఉన్న సినిమాలు చేయాలని ప్రభాస్ కోరుకుంటున్నాడట. ఆ తరహా కథలు తీసుకురమ్మని తనను సంప్రదిస్తున్న నిర్మాతలతో చెబుతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ప్రభాస్ దిల్ రాజుతో పాటు మరో సీనియర్ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్‌లతో సినిమాలు చేయడానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం ‘సలార్’ చేస్తున్న ప్రభాస్, ప్రశాంత్ నీల్‌ల కాంబినేషన్లోనే ఒక సినిమా చేసే ప్రపోజల్ దిల్ రాజు దగ్గర ఉన్నప్పటికీ.. అది కార్యరూపం దాల్చడానికి చాలా టైం పట్టేలా ఉంది.
ఈలోపు తమ సంస్థకు ఎన్నో విజయాలందించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథతో ప్రభాస్ హీరోగా ఒక సినిమా చేయాలని దిల్ రాజు చూస్తున్నట్లు సమాచారం. మరోవైపు ‘ఛత్రపతి’ తర్వాత ప్రభాస్ మళ్లీ తనకు కమిట్మెంట్ ఇవ్వడంతో ప్రసాద్ సైతం ఫ్యామిలీ స్టోరీ వేటలోనే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ‘సీతారామం’ దర్శకుడు హను రాఘవపూడి.. ఫ్యామిలీ టచ్ ఉన్న లవ్ స్టోరీనే ప్రభాస్ కోసం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి వీటిలో దేనికి ప్రభాస్ ఫైనల్‌గా ఓకే చెప్పి సెట్స్ మీదికి తీసుకెళ్తాడో చూడాలి.
This post was last modified on May 14, 2023 11:59 am
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…
ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…
ఏదైనా కథ, పాత్ర, లేదా పాట విషయంలో పాత సినిమాల నుంచి స్ఫూర్తి పొందడం కొత్తేమీ కాదు. ఐతే అలా…
నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా గురించి నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం…
నిన్న కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' టైటిల్ రివీల్ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అరిటాకులో భోజనాలు వడ్డించే ఒక…