ఒక్క సినిమా ఫలితంతో రాత్రికి రాత్రి కెరీర్లు మారిపోతూ ఉంటాయి. ఎవ్వరికీ పట్టని వాళ్లు బిజీ అయిపోవచ్చు. అందరూ వెంటపడేవాళ్లు ఖాళీ అయిపోవచ్చు. ఎక్కడైనా సక్సెస్‌కు ప్రాధాన్యం ఎక్కువే కానీ.. సక్సెస్ రేట్ మరీ తక్కువైన ఫిలిం ఇండస్ట్రీలో దానికి మరింత విలువ ఉంటుంది. అందుకే శుక్రవారంతో జీవితాలు అనూహ్యంగా మారిపోతుంటాయి.
‘ఏజెంట్’ సినిమాకు ముందు మంచి క్రేజ్‌తో కనిపించిన సురేందర్ రెడ్డి ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. ఆ సినిమా డిజాస్టర్ కావడంలో మేజర్ బ్లేమ్.. సురేందరే తీసుకోవాల్సి వచ్చింది. ఈ సినిమా రిలీజ్ కావడానికి ముందు సూరితో సినిమా చేయడానికి ఆసక్తితో ఉన్న అల్లు అర్జున్.. ఇప్పుడు ఆలోచన మార్చుకున్నట్లు తెలుస్తోంది. ‘ఏజెంట్’ రిలీజ్ తర్వాత కూడా.. బన్నీ కోసం సూరి కథ మీద కొంత వర్క్ చేసినప్పటికీ.. తర్వాతి రోజుల్లో పరిస్థితి మారిపోయినట్లు తెలుస్తోంది.
సినిమాల ఎంపికలో బన్నీ ఎంత జాగ్రత్తగా ఉంటాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. గతంలో విక్రమ్ కుమార్, లింగుస్వామి లాంటి దర్శకులతో కొన్ని నెలల పాటు ట్రావెల్ చేసి.. తర్వాత వెనక్కి తగ్గాడు. మురుగదాస్ లాంటి దర్శకుడికి కూడా ఇలాంటి అనుభవం తప్పలేదు. ఇప్పుడు సూరి పరిస్థితి కూడా ఇలాగే అయిందంటున్నారు. బన్నీతో సినిమా ఓకే అయ్యే ఛాన్స్ దాదాపుగా లేదని తేలిపోవడంతో అతను వేరే దారి చూసుకుంటున్నట్లు సమాచారం.
నితిన్‌తో అతను కొత్త సినిమా చేయడానికి చూస్తున్నాడట. సూరి ఆస్థాన రచయిత వక్కంతం వంశీతో నితిన్ ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత సూరితో జట్టు కట్టే అవకాశాలు ఉన్నాయట. మరి దీనికి కూడా వంశీనే కథ అందిస్తాడా లేదా అన్నది క్లారిటీ లేదు. కానీ నితిన్, సూరి కాంబో మాత్రం దాదాపు ఓకే అయినట్లు సమాచారం.
This post was last modified on May 14, 2023 12:44 pm
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…