ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ హీరోలు కూడా బహు భాషా చిత్రాలు చేసేస్తున్నారు. కాస్త స్టార్ ఇమేజ్ ఉంటే చాలు.. పాన్ ఇండియా సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. ఐతే అక్కినేని నాగచైతన్య ఇప్పటిదాకా అలాంటి ప్రయత్నాలేమీ చేయలేదు. కానీ ‘కస్టడీ’ సినిమాతో అతను తమిళంలోకి ఎంట్రీ ఇవ్వడానికి మాత్రం రంగం సిద్ధం చేసుకున్నాడు.
ఇది కూడా తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు రూపొందించిన సినిమా కాబట్టే చైతూ తమిళ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడానికి అవకాశం దక్కింది. కానీ చైతూ తమిళనాట విపరీతంగా తిరిగేసి తన సినిమాను ప్రమోట్ చేయడం లాంటిదేమీ చేయలేదు. అక్కడ పూర్తిగా వెంకట్ ప్రభు క్రేజ్ మీదే సినిమాను మార్కెట్ చేశారు. ఎలా అయితేనేం సినిమాకు మంచి టాక్ వచ్చి బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నందుకుంటే చైతూకు తమిళంలో మార్కెట్ క్రియేట్ కావడానికి అవకాశముంటుందని భావించారు.
ఐతే శుక్రవారం రిలీజైన ‘కస్టడీ’ సినిమాకు తెలుగులో అయితే చాలా వరకు నెగెటివ్ టాకే వచ్చింది. సమీక్షలు అనుకూలంగా లేవు. మౌత్ టాక్ కూడా అంతంతమాత్రంగానే ఉంది. కానీ తొలి రోజు వసూళ్లు నాట్ బ్యాడ్ అనిపించాయి. 7 కోట్లకు పైగా గ్రాస్.. మూడున్నర కోట్ల దాకా షేర్ రాబట్టింది ‘కస్టడీ’. తమిళం సంగతి చూస్తే.. తెలుగుతో పోలిస్తే అక్కడ టాక్ మెరుగ్గా ఉంది.
ఈ శుక్రవారం ‘కస్టడీ’తో పాటుగా మూణ్నాలుగు తమిళ సినిమాలు రిలీజ్ కావడం వల్ల దీనికి మరీ హైప్ అయితే లేదు. అదే సమయంలో సినిమా పర్వాలేదనే టాకే వస్తోంది. రివ్యూలు పర్వాలేదు. మౌత్ టాక్ కూడా బెటర్‌గానే కనిపిస్తోంది.
వెంకట్ ప్రభు స్టైల్, టైమింగ్ అదీ వాళ్లకు కొంచెం కనెక్ట్ అయినట్లు కనిపిస్తోంది. అక్కడ లిమిటెడ్ రిలీజ్ దక్కింది ‘కస్టడీ’కి. వసూళ్లు కూడా పర్వాలేదు. అందుబాటులో ఉన్న షోలకు మంచి ఆక్యుపెన్సీనే కనిపించింది. నిన్న నైట్ షోలకు. ఓవరాల్‌గా తమిళం వరకు ‘కస్టడీ’ సక్సెస్ ఫుల్ సినిమా అనిపించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
This post was last modified on May 13, 2023 9:13 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…