సోషల్ మీడియాలో ఏం మాట్లాడినా చెల్లిపోతుంది.. యూట్యూబ్ ఛానెళ్ల ఇంటర్వ్యూలో ఎన్ని వేషాలేసినా నడిచిపోద్ది అనుకునేవారికి ఈ ఉదంతం ఒక గుణపాఠం లాంటిదే. సునిశిత్ అనే ఒక కుర్రాడు కొన్నేళ్ల నుంచి యూట్యూబ్ ఛానెళ్ల ఇంటర్వ్యూల్లో చెబుతున్న మాటలు, వేస్తున్న వేషాల గురించి సోషల్ మీడియాను ఫాలో అయ్యే వాళ్లకు బాగానే తెలిసి ఉంటుంది.
1 నేనొక్కడినే సినిమాలో నేనే హీరో.. ముందు నన్నే తీసుకున్నారు.. తర్వాత మహేష్ వచ్చాడు.. లావణ్య త్రిపాఠికి నాకు పెళ్లయింది.. నా వల్ల ఆమె ప్రెగ్నెంట్ కూడా అయింది.. తర్వాత విడిపోయాం.. ఇలాంటి మాటలే ఉంటాయి అతడి ఇంటర్వ్యూల నిండా. యూట్యూబ్ ఛానెళ్ల వాళ్లు కూడా.. ఇతను చెప్పేవన్నీ అబద్ధాలని తెలిసినా తనతో ఇంటర్వ్యూలు చేస్తుంటారు. అతను కూడా అవే మాటలు రిపీట్ చేస్తూ ఉంటాడు. అందుకే అతడికి ‘శాక్రిఫయింగ్ స్టార్’ అని నెటిజన్లు కామెడీగా ఒక ట్యాగ్ కూడా ఇచ్చారు.
ఇలాంటివి చూసి అందరూ నవ్వుకుని వదిలేయరు. సీరియస్‌గా తీసుకునేవాళ్లూ ఉంటారు. ఇటీవల రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి కామెంట్లు చేశాడు. ఉపాసనతో లాంగ్ డ్రైవ్ వెళ్లా అని.. తాను చిరంజీవి అల్లుడు కావాల్సిన వాడినని.. ఇలా సాగాయి అతడి మాటలు. మెగా అభిమానులు ఈ కామెంట్లను అంత తేలిగ్గా తీసుకోలేదు.
కొందరు ఫ్యాన్స్ తాజాగా సునిశిత్‌ను ఎక్కడో ఒక చోట పట్టుకున్నారు. నలుగురైదుగురు అభిమానులు కలిసి అతణ్ని చితకబాదారు. ఇదంతా వీడియో కూడా తీశారు. తర్వాత అతడి ముందు మైక్ పెట్టి తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ కూడా చెప్పించారు. తనను చరణ్ అభిమానులు ఎందుకు కొట్టారో వివరిస్తూ.. తాను మాట్లాడింది తప్పని.. అందుకు చింతిస్తున్నానని.. ఇకపై ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయనని.. తప్పయిపోయిందని సునిశిత్ లెంపలేసుకున్నాడు.
This post was last modified on May 13, 2023 9:08 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…