‘పుష్ప’ సినిమాలో సమంత చేసిన ‘ఊ అంటావా మావా.. ఊహూ అంటావా మావా’ పాట ఒక సెన్సేషన్. ఈ పాట రిలీజైనపుడు సోసోగా అనిపించినా.. తర్వాత అది ఒక ఊపు ఊపేసింది. ఆడియో పరంగా ఈ పాట రేపిన సంచలనం ఒకెత్తయితే.. వీడియో పరంగా క్రియేట్ చేసిన సెన్సేషన్ ఇంకో ఎత్తు.
ఇందులో సమంత నెవర్ బిఫోర్ అన్నట్లుగా హాట్ హాట్‌గా కనిపించి యూత్‌కు కిర్రెక్కించింది. కెరీర్లో ఎక్కువగా ట్రెడిషనల్ రో్ల్సే చేసిన సమంతను అంత సెక్సీగా చూపించడమే పెద్ద షాక్. స్టార్ హీరోయిన్లు అలా కనిపించడానికి మామూలుగా అంగీకరించరు. ఈ పాటను వేరే స్టార్ హీరోయిన్లకు ఆఫర్ చేస్తే ఒప్పుకునే వాళ్లా అన్నది సందేహమే. ఉదాహరణకు ‘ఉప్పెన’ భామ కృతి శెట్టినే అడిగితే.. తాను ఆ పాట చేసేదాన్ని కాదని అంటోంది. అలాంటి పాటలు తనకు సూట్ కావని ఆమె తేల్చేసింది.
‘‘ఊ అంటావా.. లాంటి పాటలకు నన్ను అడిగితే ప్రస్తుతానికి అలాంటివి అంగీకరించే స్థితిలో లేను. అలాంటి పాటలు ఎలా చేయాలన్న అవగాహన కూడా నాకు లేదు. ఇప్పటి వరకు నా కెరీర్లో నేను తెలుసుకున్నది ఒక్కటే. మనకు సౌకర్యంగా అనిపించనపుడు ఏదీ చేయకూడదు. నాకు ఊ అంటావా పాట ఇష్టమే. అందులో సమంత అద్భుతంగా డ్యాన్స్ చేశారు.
ఆమె ఒక ఫైర్’’ అని కృతి శెట్టి చెప్పింది. ‘శ్యామ్ సింగ రాయ్’లో లిప్ లాక్, ఇంటిమేట్ సీన్లు చేయడానికి తాను బాగా ఇబ్బంది పడ్డట్లు కృతి ఈ సందర్భంగా వెల్లడించింది. ‘‘ఆ సినిమాలో కొన్ని రొమాంటిక్ సీన్లలో నేను వంద శాతం మనస్ఫూర్తిగా నటించలేకపోయాను. హార్ట్ ఫుల్‌గా చేయాలని అనిపించనుపుడు వాటిని వదిలేయడమే బెటర్ అనే విషయాన్ని అప్పుడే తెలుసుకున్నా. భవిష్యత్తులో ఈ విషయాన్ని గుర్తు పెట్టుకునే ముందుకు సాగుతా’’ అని కృతి చెప్పింది. ఆమె కథానాయికగా నటించిన ‘కస్టడీ’ శుక్రవారమే రిలీజైన సంగతి తెలిసిందే.
This post was last modified on May 13, 2023 2:02 pm
అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం…
కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…
ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలానాలు విధిస్తూ ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. ఇంతవరకు ఓకే. హైదరాబాద్ మహానగరంలో అయితే.. ట్రాఫిక్ నియంత్రణ వదిలేసి…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…
వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…