అనుకుంటాం కానీ టైటిల్స్ ప్రభావం ఒక సినిమాకు బజ్ తీసుకురావడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఎంపికలో ఏ మాత్రం తేడా కొట్టినా అంతే సంగతులు. కంటెంట్ బాగుంటే ఎంత పొడవు పేర్లయినా సరే జనంలోకి వెళ్లిపోతాయి. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి కొన్ని ఉదాహరణలు. కానీ ఇంగ్లీష్ టైటిల్స్ సెలెక్ట్ చేసుకునే క్రమంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా అక్కినేని హీరోలకు ఇంగ్లీష్ పేర్ల మీద అదేం మోజో అర్థం కావడం లేదు కానీ ఓపెనింగ్ రోజు మాస్ ని ఒకరకంగా ఇవే దూరం చేస్తున్నాయి.
నిన్న రిలీజైన కస్టడీకి మరీ అన్యాయంగా మూడు కోట్ల షేర్ కూడా రాలేదు. తమిళనాడులో ఇరవై లక్షలు కూడా చేయాలేదని టాక్. గత ఏడాది చైతు థాంక్ యుతో ఇదే ఫలితాన్ని అందుకున్నాడు. అఖిల్ ఏజెంట్ దెబ్బ మళ్ళీ చెబితే కామెడీ అయిపోతుంది. నాగార్జున వైల్డ్ డాగ్, ది ఘోస్ట్, ఆఫీసర్ టైటిల్స్ చూస్తే నెట్ ఫ్లిక్స్ లో వచ్చే హాలీవుడ్ వెబ్ సిరీస్ లాగా అనిపిస్తాయి. అన్ని రిజల్ట్స్ ఒకటే. ఏం మార్పు లేదు. కనీసం యావరేజ్ కూడా కాదు. అదే అచ్చమైన తెలుగులో పెట్టుకున్న బంగార్రాజు, మజిలీలు ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పని లేదు.
అంటే ఇంగ్లీష్ టైటిల్స్ పెడితే సినిమాలు ఆడవని కాదు. లెజెండ్, రోబ్ లాంటి బ్లాక్ బస్టర్లున్నాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సక్సెస్ లు లేకపోలేదు. అయితే అప్పుడప్పుడు అయితే బాగుంటుంది కానీ ఇలా ప్రతి సినిమాకి వెతికి మరీ ఆంగ్లంలో పెట్టడమేమిటని అభిమానుల ఫిర్యాదు. కస్టడీకి బదులు సినిమాలో హీరో పోషించిన కానిస్టేబుల్ పేరు శివ అని పెట్టినా ఏదో నోస్టాల్జిక్ ఫీలింగ్ తో మాస్ మొదటి రోజు థియేటర్లకు వచ్చేవారని అంటున్నారు. కొంత నిజం లేకపోలేదు. ఏది ఏమైనా మంచి కథల మీద దృష్టి పెట్టడంతో పాటు టైటిల్స్ విషయంలో పునరాలోచించుకోవడం ఉత్తమం
This post was last modified on May 13, 2023 1:46 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…