ఐశ్వర్య రాజేష్ కు ఎంత టాలెంట్ ఉన్నా సోలో హీరోయిన్ గా థియేట్రికల్ హిట్టు కొట్టిన దాఖలాలు పెద్దగా లేవు. అయితే ఓటిటిలో మాత్రం తనకు మంచి సక్సెస్ లున్నాయి. అయిదు నెలల కాలంలో అయిదు సినిమాలు రిలీజ్ కావడమంటే మాములు విషయం కాదు. నిన్న మనమంతా కస్టడీ హడావిడిలో పడిపోయాం కానీ ఫర్హానా అనే డబ్బింగ్ మూవీ ఒకటి వచ్చింది. ప్రమోషన్లు సరిగా చేయకపోవడంతో ఇదొచ్చిన సంగతే ప్రేక్షకులకు రిజిస్టర్ కాలేదు. గత చిత్రం డ్రైవర్ జమున డిజాస్టర్ ప్రభావం గట్టిగా ఉంది. అయితే ఫర్హానాకు సోషల్ మీడియాలో పాజిటివిటీ కనిపించడం విశేషం
ఇటీవలే వచ్చిన ది కేరళ స్టోరీ లానే ఇందులో ప్రధాన పాత్ర పోషించిన ఐశ్వర్య రాజేష్ ముస్లిం యువతిగా నటించింది. భర్తా పిల్లలున్నప్పటికీ కుటుంబ పోషణ కోసం కాల్ సెంటర్ లో పని చేసే ఫర్హానా అనూహ్యంగా ఓ ఆగంతకుడితో ఫోన్ పరిచయం ఎమోషనల్ అటాచ్ మెంట్ కు దారి తీస్తుంది. అతనెవరో పూర్తిగా తెలియకుండా వ్యక్తిగతంగా కలుసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఇక్కడే అసలు ట్విస్టులు మొదలవుతాయి. ఐశ్వర్య రాజేష్ తన నటనతో క్యారెక్టర్ ని నిలబెట్టింది. దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ ఒక డిఫరెంట్ పాయింట్ అయితే తీసుకున్నాడు.
రియలిస్టిక్ గా డీల్ చేస్తూనే విద్యా బాలన్ కహాని టైపు స్క్రీన్ ప్లేతో ఆకట్టుకుందామని చేసిన ప్రయత్నం ఓ మోస్తరుగా ఫలించింది. అయితే సెకండ్ హాఫ్ లో జరిగిన తడబాటు, చివరి ముప్పావు గంట వచ్చిన ల్యాగ్ తో పాటు ఆశించిన స్థాయిలో క్లైమాక్స్ లేకపోవడం ఫర్హానాని బెస్ట్ మూవీగా నిలపలేకపోయింది. అయినా కూడా సినిమా చూశాక మరీ బ్యాడ్ అనిపించుకోకుండా ఓ సారి చూడొచ్చనే ఫీలింగ్ అయితే ఇస్తుంది. ముందే చెప్పినట్టు ఐశ్యర్య రాజేష్ ని చిన్నితెరపై చూడటం అలవాటయ్యాక అదే పనిగా థియేటర్ కు వెళ్లాలనిపించడం కష్టమే. అందుకే టాక్ పెరిగితే తప్ప నిలబడటం కష్టం
This post was last modified on May 13, 2023 12:52 pm
అట్లీ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా అనౌన్స్ మెంట్ వచ్చాక దాని మీద సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ…
మంగళగిరి నియోజకవర్గం పేరు చెప్పగానే ఠక్కున ఇప్పుడు నారా లోకేష్ గుర్తుకు వస్తున్నారు. నియోజక వర్గంలో చేపడుతున్న పనులు కావొచ్చు..…
మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…