ఎంత సీనియర్ అయినా ఇప్పటికీ హీరోయిన్ వేషాలు దక్కించుకుంటున్న శ్రేయ శరన్ కు హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా సౌత్ నుంచి ఆఫర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ మధ్య కబ్జలో ఉపేంద్ర సరసన నటించింది. తాజాగా మ్యూజిక్ స్కూల్ అనే సినిమాతో నిన్న థియేటర్లలో అడుగు పెట్టింది. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఇటీవలే కెటిఆర్ ముఖ్యఅతిధిగా హైదరాబాద్ లో చేశారు. సంగీత విశ్వవిద్యాలయం ప్రతిపాదన ఇక్కడే వచ్చింది. కనీస ఓపెనింగ్స్ కరువైన ఈ మ్యూజిక్ స్కూల్ లో థియేటర్ కు రప్పించేంత కంటెంట్ ఉందా
భాగ్యనగరంలో ఓ పెద్ద కార్పొరేట్ స్కూల్. చదువు తప్ప ఇంకేదీ పనిరాదని భావించే సిద్ధాంతమున్న పాఠశాల. డ్రామా టీచర్ మనోజ్(శర్మాన్ జోషి)కు పిల్లల్లో నాటక కళను పెంచాలనే తపన ఉంటుంది. అదే సమయంలో మ్యూజిక్ టీచర్ గా వస్తుంది మారియా(శ్రేయ శరన్). తనకూ సంగీతంతో మనోవికాసాన్ని పెంపొందించివచ్చనే ప్రణాళిక ఉంటుంది. అయితే ఈ ఇద్దరి ఆలోచనలు స్టూడెంట్స్ తల్లితండ్రులకు ససేమిరా ఇష్టం ఉండదు. ఈ నేపథ్యంలో మనోజ్, మరియాలు పిల్లలతో గోవా ట్రిప్ వెళ్తారు. అక్కడికి వెళ్ళాక కొన్ని అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి
పాయింట్ బాగానే ఉన్నప్పటికీ దీన్ని థియేటర్ కంటెంట్ గా మార్చడంలో దర్శక నిర్మాత పాపారావు బియ్యాల అనుభవలేమి సరైన స్క్రీన్ ప్లేని రాసుకోనివ్వలేదు. ఏకంగా పది పాటలు పెట్టినప్పటికీ ఏ ఒక్కటి మళ్ళీ వినాలనిపించేలా లేకపోవడం ఇళయరాజా వైపు నుంచి వచ్చిన అతి నెగటివ్ పాయింట్. శ్రేయ, శర్మాన్, ప్రకాష్ రాజ్, గాయకుడు షాన్, వినయ్ వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ లాంటి క్యాస్టింగ్ బాగా చేసినప్పటికీ సాగతీత సన్నివేశాలు, ఎమోషన్ లేని ఎపిసోడ్ల వల్ల మ్యూజిక్ స్కూల్ ని చివరి దాకా భరించడం కష్టమే అయ్యింది. ఆలోచన మంచిదే కానీ ఆచరణ సరిపోలేదు
అట్లీ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా అనౌన్స్ మెంట్ వచ్చాక దాని మీద సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ…
మంగళగిరి నియోజకవర్గం పేరు చెప్పగానే ఠక్కున ఇప్పుడు నారా లోకేష్ గుర్తుకు వస్తున్నారు. నియోజక వర్గంలో చేపడుతున్న పనులు కావొచ్చు..…
మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…