ఇవాళ కస్టడీ చూశాక అధిక శాతం ప్రేక్షకులకు కలిగిన అనుమానం ఇదే. దర్శకుడు వెంకట్ ప్రభు గత చిత్రం మానాడు తమిళంలో ఎంత పెద్ద హిట్టో మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. ఓటిటిలో వచ్చాక తెలుగు అభిమానులు సైతం ఎగబడి చూశారు. టైం లూప్ కాన్సెప్ట్ ని తీసుకుని ఒకే సన్నివేశాన్ని నాలుగైదు సార్లు రిపీట్ చేసినా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా దాన్ని హ్యాండిల్ చేసిన తీరు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంది. తమిళనాడులో కొన్ని సెంటర్స్ లో షిఫ్టింగ్ తో కలిపి వంద రోజులు ఆడి సంచలననం నమోదు చేసింది. తెలుగు డబ్ సిద్ధం చేసి రిలీజ్ ని ఆపారు.
దీన్ని రీమేక్ చేయాలనే ఉద్దేశంతో సురేష్ బాబు ఆ టైంలోనే హక్కులు కొన్నారు. కానీ సెట్స్ పైకి తీసుకెళ్లే ట్రయిల్స్ ఫలించలేదు. కీలకమైన రెండు పాత్రలు శింబు-ఎస్ జె సూర్యల స్థానంలో ఎవరిని తీసుకోవాలో ఎవరిని ఒప్పించాలో చేసిన ప్రయత్నాలు చాలా జాప్యాన్ని సృష్టించాయి. నాగచైతన్య, రవితేజ, వరుణ్ తేజ్, సిద్దు జొన్నలగడ్డ, సాయిధరమ్ తేజ్ ఇలా ఎవరెవరినో ట్రై చేశారట. కానీ కాంబినేషన్ సరిగా కుదరక ఇంకా లేట్ అవుతుందనే కారణంతో పెండింగ్ లో పెట్టారు. కట్ చేస్తే దీనికి టైం పడుతుందని గుర్తించిన దర్శకుడు వెంకట్ ప్రభు కస్టడీ కథను రాసుకున్నారు.
ఇది చైతుకి నచ్చడం నిర్మాత సుధాకర్ చిట్టూరి రెడీ కావడం చకచకా జరిగిపోయాయి. ఒకవేళ మానాడు రీమేక్ నే సీరియస్ గా తీసుకుని ఉంటే కస్టడీ వచ్చేది కాదన్న కామెంట్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే హక్కులు సురేష్ సంస్థ దగ్గర ఉన్నప్పుడు వాటిని ఇచ్చేందుకాయన సిద్ధంగా ఉన్నారో లేదో తెలియదు. ఇప్పుడు ఆలస్యమైపోయింది. ఒకవేళ తీయాలనుకున్నా వెంకట్ ప్రభు బ్రాండ్ కి కస్టడీ వల్ల జరిగిన డ్యామేజ్ ఇబ్బంది పెట్టొచ్చు. క్రేజీ కాంబో కుదిరి దర్శకుడు మారితే చెప్పలేం కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఎక్కువ నాన్చకుండా వీలైనంత త్వరగా రీమేకులు చేసుకోవడం ఉత్తమం.
This post was last modified on May 12, 2023 9:32 pm
అట్లీ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా అనౌన్స్ మెంట్ వచ్చాక దాని మీద సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ…
మంగళగిరి నియోజకవర్గం పేరు చెప్పగానే ఠక్కున ఇప్పుడు నారా లోకేష్ గుర్తుకు వస్తున్నారు. నియోజక వర్గంలో చేపడుతున్న పనులు కావొచ్చు..…
మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…