బాహుబలి.. సాహో.. రాధేశ్యామ్.. ఈ మూడు సినిమాల కోసం చాలా టైం పెట్టేశాడు ప్రభాస్. ‘బాహుబలి’ లాంటి సినిమా కోసం ఎన్నేళ్లు పెట్టినా తప్పులేదు. అందుకు తగ్గ ప్రతిఫలమూ అందుకున్నాడు. కానీ తర్వాతి రెండు చిత్రాల కోసం చాలా సమయం వృథా చేశాడన్న అభిప్రాయం కలిగింది. ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి తర్వాత స్పీడు బాగా పెంచేశాడు ప్రభాస్.
ఆదిపురుష్.. సలార్.. ప్రాజెక్ట్ కే.. మారుతి సినిమా.. ఇలా వరుసగా ప్రాజెక్టులు లైన్లో పెట్టి ఒక్కోదాన్ని పూర్తి చేస్తూ వస్తున్నాడు. అతడి ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి కూడా జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగతో ‘స్పిరిట్’పై కొంచెం అయోమయం నడుస్తుండగా.. సిద్దార్థ్ ఆనంద్‌తో ఓ సినిమా.. ప్రశాంత్ నీల్‌తో మరో చిత్రం గురించి ఊహాగానాలు నడుస్తున్నాయి. ఐతే ఈలోపు ప్రభాస్‌తో జట్టు కట్టే దర్శకుడంటూ కొత్త పేరు తెరపైకి వచ్చింది. అతనే.. హను రాఘవపూడి. ఈ క్లాస్ డైరెక్టర్‌తో ప్రభాస్ ఓ ప్రేమకథ చేయబోతున్నాడని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
‘సీతారామం’ సినిమాతో హను పేరు టాలీవుడ్లో మార్మోగిపోయింది. ఈ చిత్రంతో మహామహులను అతను ఆకట్టుకున్నాడు. హను మామూలోడు కాదు అనిపించుకున్నాడు. ఇలాంటి సినిమా తీసిన దర్శకుడితో ఎవ్వరైనా సినిమా చేయాలనుకుంటారనడంలో సందేహం లేదు. ప్రభాస్ కూడా అందుకు మినహాయింపు కాదట. హను చెప్పిన ఒక ప్రేమకథకు అతను పచ్చజెండా ఊపాడని.. చాన్నాళ్లుగా తాను కోరుకుంటున్న ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉన్న లవ్ స్టోరీ ఇదని.. అందుకే ప్రభాస్ అతడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.
తనను నమ్మి ‘సీతారామం’ లాంటి పెద్ద బడ్జెట్ సినిమాను నిర్మించిన వైజయంతీ మూవీస్‌కే హను ఈ సినిమా చేయాలనుకుంటున్నాడట. ప్రస్తుతం ఆ బేనర్లోనే ‘ప్రాజెక్ట్ కే’ చేస్తున్న ప్రభాస్ కూడా మళ్లీ ఆ సంస్థలో చేయడానికి సుముఖంగానే ఉన్నాడట. స్క్రిప్టు ఒక కొలిక్కి వచ్చాక ఈ సినిమాను ప్రకటిస్తారని.. ఐతే ఇది సెట్స్ మీదికి వెళ్లడానికి చాాలా టైం పట్టొచ్చని అంటున్నారు.
This post was last modified on May 12, 2023 3:33 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…