అక్కినేని వారి గడ్డు కాలం గురించి ఈ మధ్య ఎంత చర్చ జరుగుతోందో తెలిసిందే. ఒకప్పుడు వైభవం చూసిన నాగ్.. ఓ మోస్తరు హిట్ కొట్టి చాలా ఏళ్లయిపోయింది. ‘ఆఫీసర్’ దగ్గర నుంచి ఆయనకు బాక్సాఫీస్ దగ్గర చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ‘వైల్డ్ డాగ్’ అనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర చేదు అనుభవమే మిగిల్చింది. గత ఏడాది ‘ది ఘోస్ట్’కు టాక్ బాలేదు. అలాగే సినిమా కూడా ఆడలేదు.
నాగ్ కెరీర్లోనే అత్యంత తక్కువ ఓపెనింగ్స్ తెచ్చిన సినిమాల్లో ఇదొకటిగా నిలిచింది. ఇక అంతకంటే ముందు నాగ్ పెద్ద కొడుకు నాగచైతన్య ‘థాంక్యూ’ సినిమాతో గట్టి ఎదురు దెబ్బ తిన్నాడు. కనీసం అఖిల్ అయినా మంచి హిట్ కొడతాడని ఈ మధ్య ‘ఏజెంట్’ మీద భారీ ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు అక్కినేని ఫ్యాన్స్. కానీ ఈసారి మరింత చేదు అనుభవం తప్పలేదు. ‘ఏజెంట్’ సినిమా టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్ అయింది. దీంతో అక్కినేని అభిమానుల బాధ మామూలుగా లేదు.
‘ఏజెంట్’ సినిమా వచ్చిన రెండు వారాలకే ఇప్పుడు చైతూ ‘కస్టడీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నాగ్, అఖిల్ కొత్త సినిమాలు ఇంకో ఏడాదికి కానీ రిలీజయ్యే సంకేతాలు లేవు. చైతూ కూడా కొత్త సినిమా విషయంలో ఇంకా ఏమీ తేల్చలేదు. ఈ నేపథ్యంలో ‘కస్టడీ’ మీదే అక్కినేని వారి ఆశలన్నీ నిలిచి ఉన్నాయి. డిజాస్టర్ స్ట్రీక్‌కు చైతూ బ్రేక్ వేస్తాడని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.
తమిళంలో మంచి దర్శకుడిగా పేరున్న వెంకట్ ప్రభు ఈ చిత్రాన్ని రూపొందించడం.. ప్రోమోలు ఆసక్తికరంగా ఉండటంతో ‘కస్టడీ’ అక్కినేని వారి రాత మార్చగలదనే అనుకుంటున్నారు. కానీ చైతూ ట్రాక్ రికార్డు వల్ల, బాక్సాఫీస్ పరిస్థితుల వల్ల పెద్దగా హైప్ అయితే లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్లోగానే ఉన్నాయి. టాక్ చాలా కీలకంగా మారింది. మరి ఈ రోజు మంచి టాక్ తెచ్చుకుని ‘కస్టడీ’ బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించి.. అక్కినేని ఫ్యామిలీకి, అభిమానులకు ఊరటనిస్తుందేమో చూడాలి.
This post was last modified on May 12, 2023 11:04 am
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…
అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…
బలంగా మాట్లాడాలి. మాటకు మాట కౌంటర్ ఇవ్వాలి. అది వింటే ప్రత్యర్థులు నోరు అప్పగించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…