Movie News

లోబజ్‌తో 22 కోట్లు కొట్టాలి

అక్కినేని నాగచైతన్య మరోసారి బాక్సాఫీస్ పరీక్షకు సిద్ధమయ్యాడు. ‘మజిలీ’ తర్వాత చైతూకు సరైన విజయం లేని సంగతి తెలిసిందే. అతడి చివరి సినిమా ‘థాంక్యూ’ బాక్సాఫీస్ దగ్గర చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. విక్రమ్ కుమార్ లాంటి స్టార్ డైరెక్టర్, దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత కలిసి చేసిన ఈ సినిమా కనీసం నాలుగు కోట్ల షేర్ కూడా రాబట్టలేక డిజాస్టర్ అయింది. మామూలుగా చైతూకు క్లాస్ సినిమాలు బాగానే కలిసొస్తుంటాయి. కానీ ఈ సినిమా అతడి శైలిలోనే సాగినా.. ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

ఈసారి అతను కొంచెం మాస్ టచ్ ఉన్న.. థ్రిల్లర్ కథతో బాక్సాఫీస్ వేటకు రెడీ అయ్యాడు. తమిళంలో విలక్షణ కథలతోనే కమర్షియల్‌గా మంచి విజయాలు అందుకున్న వెంకట్ ప్రభు.. చైతూ తీసిన ‘కస్టడీ’ ఈ శుక్రవారమే తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ రెండూ కూడా ఆకట్టుకున్నాయి. ఒక ఉత్కంఠభరిత ట్రైలర్ చూడబోతున్న సంకేతాలు ఇచ్చాయి.

కానీ ప్రస్తుతం బాక్సాఫీస్ పరిస్థితి ఏమంత బాగా లేకపోవడం, చైతూ గత సినిమాల ప్రభావం వల్ల ‘కస్టడీ’ అనుకున్నంత బజ్ అయితే లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ కొంచెం డల్లుగానే నడుస్తున్నాయి. తమిళంలో పూర్తిగా వెంకట్ ప్రభు ఇమేజ్ మీదే ఈ సినిమా ఫలితం ఆధారపడబోతోంది. తెలుగు వరకు ఈ సినిమా రూ.22 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేసింది. నైజాం ఏరియాకు రూ.8 కోట్లు, ఆంధ్రా-రాయలసీమ కలిపి రూ.12 కోట్లకు హక్కులు అమ్మినట్లు సమాచారం.

మామూలుగా చూస్తే ఇది మరీ పెద్ద టార్గెట్ కాదు కానీ.. ప్రస్తుత బాక్సాఫీస్ పరిస్థితులు, చైతూ ట్రాక్ రికార్డు దృష్ట్యా ఇది కొంచెం పెద్ద టార్గెట్టే. ఈ సినిమాకు మరీ ఎక్కువ ఓపెనింగ్స్ ఆశించే పరిస్థితి లేదు. మొత్తం టాక్ మీదే ఆధారపడి ఉంది. రూ.22 కోట్ల షేర్ రావాలంటే టాక్ చాలా బాగుండాలి. గత నెలలో ‘విరూపాక్ష’ సినిమా తక్కువ బజ్‌తోనే రిలీజై.. పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్లింది. అలాంటి మ్యాజిక్కే ‘కస్టడీ’కి కూడా జరగాల్సి ఉంది.

This post was last modified on May 10, 2023 6:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

11 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

12 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

13 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

13 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

13 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

14 hours ago