అక్కినేని నాగ చైతన్య , వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కస్టడీ’ మరో రెండ్రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో చైతు కానిస్టేబుల్ గా నటించాడు. విలన్ ను కాపాడటమే హీరో లక్ష్యమని అదేంటనేది సినిమా చూస్తే తెలుస్తుందని దర్శకుడు చెప్పేశాడు. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కాస్త ఫాస్ట్ గానే ఫినిష్ చేశారు. కాకపోతే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి వచ్చే సరికి ఎప్పటిలానే టీం ఉరుకులు పరుగులు పెడుతూ వర్క్ చేశారు.
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ టైమ్ లో బై లింగ్వెల్ సినిమా కష్టాలన్నీ తెలిసొచ్చాయని వెంకట్ ప్రభు తెలిపాడు. అటు చెన్నై ఇటు హైదరాబాద్ తిరుగుతూ నిద్ర లేకుండా పనిచేస్తున్నానని తెలిపాడు. కస్టడీ టీం ను ఇబ్బంది పెట్టిన మరో విషయం ఏంటంటే వీఎఫ్ఎక్స్. సినిమాలో కొన్ని సన్నివేశాలకు సీజీ వర్క్ చాలా ఉందట. దానికోసమే ఫస్ట్ కాపీ ఆలస్యమైందని తాజాగా నిర్మాత తెలిపారు. దీంతో ఓవర్సీస్ కి కంటెంట్ కాస్త ఆలస్యంగా చేరింది. నిన్న రాత్రి కంటెంట్ లోడ్ చేశారు.
ఇదంతా చూస్తుంటే ఈ బై లింగ్వెల్ సినిమా కోసం తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు చాలా కష్టాలు పడుతూ పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేశారని అర్థమవుతుంది. ఏదేమైనా షూటింగ్ అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మేకర్స్ అనుకున్నంత వేగంగా జరగడం లేదు. ఏజెంట్ విషయంలోనూ ఇదే జరిగింది. సురేందర్ రెడ్డి వారం పాటు మీడియాకి కనిపించకుండా ప్రమోషన్స్ కి దూరమై వర్క్ చేసి ఫస్ట్ కాపీ రెడీ చేయాల్సి వచ్చింది. మిగతా దర్శక నిర్మాతలకి ఇవన్నీ చక్కని పాఠాలే.
అట్లీ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా అనౌన్స్ మెంట్ వచ్చాక దాని మీద సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ…
మంగళగిరి నియోజకవర్గం పేరు చెప్పగానే ఠక్కున ఇప్పుడు నారా లోకేష్ గుర్తుకు వస్తున్నారు. నియోజక వర్గంలో చేపడుతున్న పనులు కావొచ్చు..…
మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…