మాములుగా సినిమా పాట రాయడమంటేనే అదో పెద్ద కసరత్తు. ప్రాసలు, సంధులు, సమాసాలు అన్నీ సరిచూసుకుని ఛందస్సు సూత్రాలను పాటిస్తూ మెప్పించేలా సాహిత్యాన్ని సృష్టించడం గొప్ప ప్రక్రియ. ఆత్రేయ, వేటూరి, సిరివెన్నెల లాంటి వాళ్ళు చరిత్రలో నిలిచిపోయారంటే కారణం ఇదే. అలాంటిది కేవలం టైటిల్స్ తో పాట రాయడమంటే అదో సవాల్ లాంటిది. చాలా అరుదుగా ఈ ప్రయత్నం జరుగుతుంది. గతంలో దాసరి మనుషులంతా ఒక్కటే, బాలచందర్ మరో చరిత్ర లాంటి క్లాసిక్ చిత్రాల్లో మాత్రమే ఇలాంటివి చేసి సక్సెస్ అయ్యారు.
మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఖుషి దర్శకుడు శివ నిర్వాణ ఈ ప్రయోగం చేశారు. ఈ రోజు విడుదలైన ఫస్ట్ ఆడియో సింగల్ నువ్వే నా ఖుషిలో చాలా టైటిల్స్ ని పొందుపరిచారు. ముఖ్యంగా ఆయన మీద బలమైన ప్రభావం చూపించిన మణిరత్నం ఆల్ టైం హిట్స్ రోజా, సఖి, చెలియా, అంజలి, గీతాంజలితో పాటు దళపతి కూడా వచ్చేలా చూసుకున్నారు. వేరొకరైతే తన ఫీలింగ్స్ ని ఇంత ఖచ్చితంగా ఇవ్వలేరు అనుకున్నారేమో కానీ తన కలంనే వాడేశారు. గతంలో టక్ జగదీష్ కోసం లిరిక్స్ రాసిన శివ నిర్వాణ ఇప్పుడీ ఎక్స్ పరిమెంట్ తో కొత్త ఐడియా ఇచ్చారు
మలయాళం ఫేమ్ హేశం అబ్దుల్ వాహబ్ సంగీత దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమవుతున్న చిత్రమిదే. కూల్ మెలోడీతో డెబ్యూతోనే ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాడు. నాని 30కి కూడా ఇతనే పని చేస్తున్న సంగతి తెలిసిందే. ముస్లిం యువతిగా సమంతా నటిస్తుండగా ఆమెను ప్రేమించే యువకుడిగా విజయ్ దేవరకొండ పాత్ర కొత్తగా ఉండనుంది. కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో ఉందని విజువల్స్ చూస్తే అర్థమైపోతోంది. ఖుషికి పని చేస్తున్న ప్రతిఒక్కరికి దీని సక్సెస్ చాలా కీలకం. సామ్ ఆరోగ్యం వల్ల కొంత గ్యాప్ రావడంతో ఆలస్యమైనా సెప్టెంబర్ 1న విడుదల కానుంది
This post was last modified on May 10, 2023 6:26 am
విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…
#AskKavitha- హ్యాష్ ట్యాగ్తో నెటిజన్ల నుంచి అభిప్రాయాలు సేకరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. ఇదే సమయంలో పలువురు నెటిజన్లు…
భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు…
మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…
నటుడిగా చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో విలన్ గా నటించి కంబ్యాక్ అయ్యాడు.…
హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…