Movie News

అనసూయకు ‘The’ కౌంటర్ల మోత

సోషల్ మీడియాలో అనసూయకు, నెటిజన్లకు మధ్య గొడవలు జరగడం మామూలు విషయం. ముఖ్యంగా విజయ్ దేవరకొండ అభిమానులతో ఆమె వైరం కొన్నేళ్ల నుంచి కొనసాగుతోంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో భాగంగా అతను పలికిన బూతు మాట విషయంలో అనసూయ సోషల్ మీడియా వేదికగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో మొదలైంది ఈ గొడవ. తాజాగా ‘ఖుషి’ పోస్టర్లో తన పేరుకు ముందు ‘The’ అని పెట్టుకోవడంపై విజయ్‌‌ని అనసూయ టార్గెట్ చేసింది.

దీంతో విజయ్ అభిమానులతో పాటు న్యూట్రల్ నెటిజన్స్ కూడా ఆమె తీరును తప్పుబట్టారు. దాదాపు వారం రోజులుగా ఈ గొడవ నడుస్తోంది. ఐతే విజయ్‌ని తప్పుబట్టడం సరే కానీ.. తమ పేర్ల ముందు రకరకాల బిరుదులు పెట్టుకున్న ప్రతి స్టార్ హీరోనూ అనసూయ తప్పుబట్టగలదా.. అవేవీ అభ్యంతరకరం కాదా.. వారిని ఇలాగే టార్గెట్ చేయగలదా.. అని అడిగితే మాత్రం అనసూయ నుంచి సమాధానం లేదు. చాలామంది నెటిజన్లు ఆవేశ పడి ఆమెను బూతులు తిడుతుంటే.. ఆ స్క్రీన్ షాట్లు తీసి కౌంటర్లు వేస్తున్న అనసూయ.. ఇలా మర్యాదగా, లాజిక్‌తో ప్రశ్నించే వారికి మాత్రం సమాధానం ఇవ్వడం లేదన్నది నెటిజన్ల మాట.

ఇదిలా ఉండగా.. అనసూయ తీరు ఇండస్ట్రీలోని వాళ్లకు కూడా నచ్చనట్లు కనిపిస్తోంది. ఇండస్ట్రీలో ఉంటూ ఇలా ఒక హీరోను టార్గెట్ చేయడం చాలామందికి ఆగ్రహం తెప్పిస్తోంది. కొందరు తమ కోపాన్ని దాచుకోవట్లేదు. స్వయంగా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్.. అనసూయకు మంట పుట్టేలా విజయ్‌కి బర్త్ డే విష్ చెప్పాడు. అందులో THE passion he has.. THE temper he holds.. THE anger he controls.. THE stardom he achieved.. makes him THE vijaydeverakonda.. Wishing THE most deserved man of our generations a very happy birthday in advance.. ఇదీ హరీష్ శంకర్ పెట్టిన విజయ్ బర్త్‌డే పోస్టు.

ఇలా పదే పదే ‘The’ అని వాడి అనసూయకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు హరీష్. ఇదిలా ఉంటే.. విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘బేబీ’ సినిమా నుంచి కొత్త పాటకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ సందర్భంగా.. నటీనటులు, టెక్నీషియన్లందరి పేర్ల ముందు ‘The’ అని పెట్టి పోస్టర్ రిలీజ్ చేసి సంచలనం రేపింది ఆ చిత్ర బృందం. ఓవైపు నెటిజన్ల ఎదురుదాడికి తోడు.. ఇలా సినిమా జనాలే కౌంటర్లు వేస్తుంటే అనసూయ తట్టుగలదా మరి?

This post was last modified on May 9, 2023 1:41 pm

Share

Recent Posts

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

1 hour ago

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

2 hours ago

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

10 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

11 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

11 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

11 hours ago