మొన్న ‘కస్టడీ’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు వెంకట్ ప్రభు చేసిన ప్రసంగం అందరి దృష్టినీ ఆకర్షించింది. ‘‘సినిమాలో మాస్ వేనుమా మాస్ ఇరుక్కు..’ అంటూ ఆయన ‘వారిసు’ ఆడియో వేడుక సందర్భంగా పాపులర్ అయిన దిల్ రాజు స్పీచ్ తరహాలో.. ఆయన్ని ఇమిటేట్ చేస్తూ ప్రసంగించాడు.
ఒక దర్శకుడు ఇలా ఓ నిర్మాతను అనుకరిస్తూ ఫన్నీగా మాట్లాడ్డం ఆశ్చర్యకరం. ఐతే వెంకట్ ప్రభు శైలి తెలిసిన వాళ్లకు మాత్రం ఇది ఆశ్చర్యంగా అనిపించదు. ‘చెన్నై 28’ నుంచి మొదలుపెడితే.. వెంకట్ ప్రభు సినిమాలన్నీ కూడా ఇలాగే ఫన్నీగా, సెటైరికల్‌గా ఉంటాయి.
సీరియస్ సినిమాల్లోనూ సెటైరికల్ కామెడీతో ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెడతాడు. సరోజ, గోవా, మన్కాతా, మాస్, బిరియాని, మానాడు.. ఇలా వెంకట్ ప్రభు కెరీర్లో ప్రతి సినిమాలో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. తన సినిమాలన్నీ ఉత్కంఠ రేకెత్తిస్తూనే.. మంచి వినోదం పంచుతాయి. అందుకే వెంకట్‌కు తమిళంలో భారీగా అభిమానగణం ఉంది. తన సినిమాల కోసం ఎంతోమంది ఉత్కంఠగా ఎదురు చూస్తారు. తనతో ఒక్కసారైనా పని చేయాలని స్టార్ హీరోలు కోరుకుంటారు.
అజిత్, సూర్య లాంటి టాప్ స్టార్లతో సినిమాలు చేసిన వెంకట్ ప్రభు.. ‘లవ్ స్టోరీ’ చూసి తన రాసిన ఒక పాత్రకు నాగచైతన్యనే సరిపోతాడని ఏరి కోరి అతణ్ని ఎంచుకోవడం విశేషమే. వీరి కలయికలో వస్తున్న ‘కస్టడీ’ ట్రైలర్ చూస్తే.. వెంకట్ ప్రభు మార్కు థ్రిల్లర్ అనే విషయం అర్థమవుతుంది.
ఇంటలిజెంట్ స్క్రీన్ ప్లేతో ఉత్కంఠ రేకెత్తిస్తూనే ఎంటర్టైన్మెంట్‌కు ఢోకా లేకుండా చూసుకుంటాడు వెంకట్ ప్రభు. ప్రధాన పాత్రలు కూడా ఆసక్తికరంగా ఉంటాయి. ప్రోమోల్లో వెంకట్ మార్కు కనిపించింది. సినిమాలో కూడా ఆయన మ్యాజిక్ కొనసాగిస్తే చైతూ ఎప్పట్నుంచో కోరుకుంటున్న మాస్ హిట్ పడి అతడి కెరీర్ మరో స్థాయికి వెళ్లడం ఖాయం. ఈ నెల 12నే ‘కస్టడీ’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on May 10, 2023 2:34 pm
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…