ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని నందమూరి కుటుంబం డిమాండ్ చేసింది. అదేవిధంగా అభిమానుల తరపున తాను కూడా డిమాండ్ చేస్తున్నానని నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కోరారు. హైదరాబాద్లోని మాసబ్‌ట్యాంక్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మినీ మహానాడు, ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసగించారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజల గుండెల్లో గూడుకట్టుకుని ఉందని పేర్కొన్నారు.
సామాన్యుల కోసం ఎన్టీఆర్ సాహసోపేతమైన పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితో తెలుగు యువత సేవా కార్యక్రమాలు కొనసాగించాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సాంకేతికంగా విడిపోయినా ఏపీ, తెలంగాణ ప్రజలు అన్నదమ్ములుగా కలిసే ఉండాలని బాలకృష్ణ ఆకాంక్షించారు. రాష్ట్రంలో టీడీపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఎన్టీఆర్ పేరు చెప్పగానే ప్రతి తెలుగు వ్యక్తి గుండె పొగరుతో నినదిస్తోందని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. సామాన్యుల కోసం ఎన్టీఆర్ సాహసోపేతమైన పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. ఎందరో రాజకీయనేతలకు మంచి మంచి అవకాశాలు ఇచ్చారని పేర్కొన్నారు. మన దేశంలో సామాజిక విప్లవం తీసుకొచ్చారని గుర్తు చేశారు. మండల వ్యవస్థ, మహిళ యూనివర్శిటీ, వెనుక బడిన సామాజిక వర్గాలు వారికి రిజర్వేషన్లు పెంచారని తెలిపారు. ఇలా ఎన్టీఆర్ తీసుకొచ్చిన పథకాలు, హైదరాబాద్లో ఆయన హాయంలో జరిగిన అభివృద్ధిని వివరించారు.
దేశంలో సామాజిక విప్లవం తీసుకొచ్చారు. మండల వ్యవస్థను తీసుకొచ్చారు. వెనుక బడిన సామాజిక వర్గాల వారికి రిజర్వేషన్లు పెంచారు. మహిళ యూనివర్శిటీ, హెల్త్ యూనివర్శటీలు తీసుకొచ్చారు. ఎన్నో చారిత్రత్మక పథకాలు తీసుకొచ్చారు. అలాంటి వ్యక్తికి మా కుటుంబం, రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులు, టీడీపీ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నా.. ఎన్టీఆర్కు భారత్న రత్న ఇవ్వాలి అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.
This post was last modified on May 9, 2023 6:30 am
అట్లీ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా అనౌన్స్ మెంట్ వచ్చాక దాని మీద సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ…
మంగళగిరి నియోజకవర్గం పేరు చెప్పగానే ఠక్కున ఇప్పుడు నారా లోకేష్ గుర్తుకు వస్తున్నారు. నియోజక వర్గంలో చేపడుతున్న పనులు కావొచ్చు..…
మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…