ఒకప్పటితో పోలిస్తే సినిమాను ప్రమోట్ చేసే తీరే మారిపోయింది. ప్రి రిలీజ్ ఈవెంట్లకు తోడు రకరకాలుగా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద హీరోలు కూడా ఎంతో ఓపిగ్గా.. మీడియా ప్రతినిధులకు ఉమ్మడిగా.. అలాగే విడివిడిగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. టీవీ, వెబ్ మీడియా ప్రతినిధులను కలిసి సుదీర్ఘ వీడియో ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఇవి కాక అనేక నగరాల్లో తిరుగుతూ ఈవెంట్లలో పాల్గొంటున్నారు. ఇవన్నీ ఇష్టం లేని వాళ్లు కూడా అనివార్యంగా చేయాల్సి వస్తోంది.
ఐతే నిజంగా ఒక సినిమాకు ఇలాంటి ప్రమోషన్లు అవసరమా.. అవి ఉపయోగపడతాయా అనే సందేహాలు వ్యక్తమవుతుంటాయి. ఈ విషయంలో అక్కినేని నాగచైతన్య ఆసక్తికర విశ్లేషణ చేశాడు ఓ ఇంటర్వ్యూలో. ఒక సినిమాకు వీటన్నిటి కంటే టీజర్, ట్రైలర్, పాటలు బాగుండటం ముఖ్యం అని చైతూ అన్నాడు. అవి బాగుంటే.. అంతకు మించి ఏమీ అవసరం లేదన్నట్లు చైతూ మాట్లాడాడు. ప్రోమోలు బాగుంటే ప్రేక్షకుల్లో ఆటోమేటిగ్గా సినిమా పట్ల ఆసక్తి కలుగుతుందని.. ఆ టైంలో ప్రమోషన్లు చేస్తే అవి అదనపు ప్రయోజనం చేకూరుతుందని చైతూ చెప్పాడు.
ప్రోమోలు బాలేకుండా.. సినిమా కూడా బాలేనపుడు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా.. ఎన్ని ఈవెంట్లు చేసినా ప్రయోజనం శూన్యం అని చైతూ కుండబద్దలు కొట్టాడు. ఇక తన చివరి సినిమా ‘థాంక్యూ’ గురించి మాట్లాడుతూ.. ఎడిట్ రూంలో చూసినపుడే ఆ సినిమా ఆడదని తేలిపోయిందన్నాడు. ఆ కథ బాగున్నప్పటికీ.. దాన్ని సరిగ్గా తీయలేదని.. సినిమా ఆడదని ముందే అర్థమైనప్పటికీ.. నిర్మాత నష్టపోకూడదన్న ఉద్దేశంతో ప్రమోట్ చేసినట్లు నిజాయితీగా అంగీకరించాడు చైతూ. ఈ సినిమా తీసిన విక్రమ్ కుమార్ అమేజాన్ ప్రైమ్ కోసం తనతో చేసిన ‘దూత’ మాత్రం చాలా బాగుంటుందని.. అలాగే తన కొత్త చిత్రం ‘కస్టడీ’ని ఎడిటింగ్ టైంలో చూస్తే చిన్న లోపం కూడా కనిపించలేదని చైతూ అన్నాడు.
This post was last modified on May 8, 2023 3:44 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…