Movie News

బాలయ్య కొత్త సినిమా పై ఉత్కంఠ

స్టార్ హీరోలు ఒక సినిమా చేస్తుండగానే.. వాళ్ల తర్వాతి సినిమా మీద ఆసక్తికర చర్చలు మొదలైపోతాయి. విరామం లేకుండా సినిమాలు చేసుకుపోయే నందమూరి బాలకృష్ణ.. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే ఇంకోదానికి రంగం సిద్ధం చేసుకుంటూ ఉంటాడు. ‘అఖండ’ చేస్తున్నపుడే ‘వీరసింహారెడ్డి’ సినిమాను ఓకే చేసిన ఆయన.. ఈ చిత్రంలో నటిస్తుండగానే అనిల్ రావిపూడి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఇప్పుడు ఈ సినిమా షూట్ జోరుగా సాగుతున్న టైంలోనే తర్వాతి సినిమా కోసం చర్చలు నడుస్తున్నాయి. మామూలుగా బాలయ్య పుట్టిన రోజుకు ఆయన అప్పటికే నటిస్తున్న సినిమా తాలూకు గ్లింప్స్ రిలీజ్ చేయడమే కాక.. కొత్త సినిమాల ప్రకటనలు ఉండేలా చూసుకుంటాడు. గత ఏడాది అనిల్ రావిపూడి సినిమాను జూన్ 10న బాలయ్య పుట్టిన రోజుకే ప్రకటించడం అభిమానులకు గుర్తే.

ఈసారి అనిల్ సినిమా తాలూకు వీడియో గ్లింప్స్‌తో పాటు టైటిల్‌ను కూడా వచ్చే నెల పదో తారీఖున రివీల్ చేస్తారని తెలుస్తోంది. దీంతో పాటు బాలయ్య కొత్త సినిమా ప్రకటన కూడా ఆ రోజు ఉంటుందట. ఐతే ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు.. బాలయ్య ఏ కథకు ఓటేశారు అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. ముందు అనుకున్న ప్రకారం అయితే బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య కొత్త సినిమా చేయాల్సింది. వీరి కలయికలో అఖండ-2 వస్తుందనే ఊహాగానాలు ముందు నుంచి ఉన్నాయి. ‘అఖండ’ బ్లాక్ బస్టర్ అయ్యాక దానికి సీక్వెల్ ఉంటుందని బాలయ్య , బోయపాటి సంకేతాలు ఇచ్చారు.

ఐతే అనిల్ సినిమా తర్వాత ఈ చిత్రమే ఉంటుందని గ్యారెంటీ లేదు. ఎందుకంటే బోయపాటి ఇంకా కథను సిద్ధం చేయలేదు. రామ్ సినిమా పనిలో బిజీగా ఉన్నాడు. దాన్ని పూర్తి చేసి బాలయ్య కోసం స్క్రిప్టు రెడీ చేయడానికి టైం పడుతుంది. ఈ లోపు బాలయ్య ఇంకో సినిమా చేస్తాడంటున్నారు. ఈ మధ్య ప్రచారంలోకి వచ్చిన పూరి సినిమా ‘కాకా’నే అది అవుతుందా.. లేక బాలయ్య మదిలో ఇంకెవరైనా దర్శకుడు ఉన్నాడా అన్నది ఆసక్తికరం.

This post was last modified on May 8, 2023 3:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బన్నీ చేస్తోంది లోకేష్ డ్రీమ్ ప్రాజెక్టా ?

అట్లీ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా అనౌన్స్ మెంట్ వచ్చాక దాని మీద సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ…

4 hours ago

ఆర్కే ఏమ‌య్యారు… వైసీపీలో హాట్ టాపిక్ ..?

మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం పేరు చెప్ప‌గానే ఠ‌క్కున ఇప్పుడు నారా లోకేష్ గుర్తుకు వ‌స్తున్నారు. నియోజ‌క వర్గంలో చేప‌డుతున్న ప‌నులు కావొచ్చు..…

5 hours ago

అర్ధరాత్రి షోలతో వరప్రసాద్ గారి వీరంగం

మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…

6 hours ago

బన్నీతో లోకీ – అడవిలో అరాచకం ?

గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…

8 hours ago

షాకింగ్… బాహుబలి 2ని దాటేసిన దురంధర్

చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…

8 hours ago

అన్నగారు తప్పుకోవడమే మంచిదయ్యింది

తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…

9 hours ago